దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారో తెలుసా..?
బంగారం కోసం దొంగలు పెట్రేగిపోతున్నారు.. వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు.. తాజాగా.. మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో వృద్ధ దంపతులపై దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు.

బంగారం కోసం దొంగలు పెట్రేగిపోతున్నారు.. వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు.. తాజాగా.. మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో వృద్ధ దంపతులపై దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. గ్రామానికి చెందిన సాలె అంజయ్య, సావిత్రి అనే వృద్ధ దంపతులు తమ నివాసంలో ఉన్న సమయంలో దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు ద్విచక్ర వాహనంపై వచ్చి పక్క ప్లాన్‌తో దాడికి పాల్పడ్డారు.
బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నేరుగా ఇంట్లోకి చొరబడ్డారు. ప్రతిఘటించే ప్రయత్నం చేసిన వృద్ధ దంపతులపై కనికరం లేకుండా దాడి చేశారు. వారిని గాయపరిచి, ఒంటిపై ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. రక్తగాయాలతో పడి ఉన్న వృద్ధుల కేకలు విన్న స్థానికులు.. వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వీడియో చూడండి..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, నిందితుల కదలికలు రికార్డైనట్లు తెలుస్తోంది. ఈ క్లూస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టపగలే వృద్ధులపై దాడి జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
