Telangana: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారద లొంగుబాటు.. వెల్లడించిన డీజీపీ..

Telangana: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య సమ్మక్క అలియాస్ శారద పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శారద తాజాగా తెలంగాణ..

Telangana: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారద లొంగుబాటు.. వెల్లడించిన డీజీపీ..
Dgp
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2021 | 3:55 PM

Telangana: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య సమ్మక్క అలియాస్ శారద పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శారద తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. అంతేకాదు.. కొంతకాలం నుంచి మావోయిస్టు పార్టీకి హరిభూషణ్ కుటుంబం దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే హరిభూషణ్ భార్య శారద లొంగిపోయారనే వార్తలూ వినిపిస్తున్నాయి. శారద లొంగుపోయిన విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం నాడు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ, తెలంగాణ సెంటర్ కమిటీ మెంబర్‌గా ఉన్న హరిభూషణ్ ఈ ఏడాది జూన్ 21వ తేదీన అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన సతీమణి జజ్జేరి సమ్మక్క అలియాస్ శారద పోలీసుల ముందు లొంగిపోయారు. పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితులైన శారదను 1994లో 18 ఏళ్లు నిండక ముందే పాండవ దళంలోకి తీసుకెళ్లారు హరిభూషణ్. 1999లో నార్త్ తెలంగాణా స్పెషల్ జోన్‌లో ప్లాటూన్ మెంబెర్‌గా పని చేశారు. చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శారదకు ఓ బుల్లెట్ తగిలింది. ఆ ఘటనలో శారద ఓ కన్ను పోగొట్టుకున్నారు. శారద స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం.

Also read:

Hotel Room: ఈ హోటల్‌‌లో ఆ గది వెరీ స్పెషల్.. ఒక రోజు అద్దె ఎంతో తెలిస్తే గుండె గుభేలే..!

Rape Victim Suicide: బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రేపిస్ట్.. విషయం తెలిసి బాధితురాలు ఏం చేసిందంటే..?

Kamala Harris: కమలా హారిస్‌ను చంపేందుకు 53వేల డాలర్ల ఒప్పందం.. కోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితురాలు..