AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hotel Room: ఈ హోటల్‌‌లో ఆ గది వెరీ స్పెషల్.. ఒక రోజు అద్దె ఎంతో తెలిస్తే గుండె గుభేలే..!

Hotel Room: రాజస్థాన్‌లో ఖరీదైన హోటళ్లు చాలా ఉన్నాయని అందరికీ తెలిసిందే. ప్యాలెస్ మాదిరి నిర్మించిన ఈ హోటళ్లలో ప్రత్యేక గదులు కూడా ఉంటాయి. అందుకు తగినట్లుగానే రేట్లు కూడా ఉంటాయి.

Hotel Room: ఈ హోటల్‌‌లో ఆ గది వెరీ స్పెషల్.. ఒక రోజు అద్దె ఎంతో తెలిస్తే గుండె గుభేలే..!
Hotel Room
Shiva Prajapati
|

Updated on: Sep 17, 2021 | 1:48 PM

Share

Hotel Room: రాజస్థాన్‌లో ఖరీదైన హోటళ్లు చాలా ఉన్నాయని అందరికీ తెలిసిందే. ప్యాలెస్ మాదిరి నిర్మించిన ఈ హోటళ్లలో ప్రత్యేక గదులు కూడా ఉంటాయి. అందుకు తగినట్లుగానే రేట్లు కూడా ఉంటాయి. అందుకే ఈ హోటళ్లలో ధనవంతులు మాత్రమే స్టే చేయగలుగుతారు. ఆ హోటళ్లలో ఒక వారం పాటు స్టే చేస్తే ఖర్చుచేసే డబ్బుతో ఒక ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా జైపూర్‌లోని ఒక హోటల్ గురించి, అందులో ఉన్న ఓ గది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ హోటల్ రెంట్ ఊహించని స్థాయిలో ఉంటుంది. లగ్జరీ లైఫ్‌కి ఈ హోటల్ ప్రసిద్ధి చెందింది. ఈ హోటల్ రూమ్‌లో స్టే చేయడానికి ఒక రోజుకు లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి లక్షల్లో రెంట్ చెల్లించేంతలా ఆ గదుల్లో ప్రత్యేకత ఏముంది? అంత పెద్ద మొత్తంలోనూ చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉండటానికి కారణం ఏంటి? వంటి విశేషాలుు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ గది ఏ హోటల్‌లో ఉంది? ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న ప్రత్యేక హోటల్ జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్. జైపూర్‌లోని ఈ ఫైవ్ స్టార్ హోటల్ చర్చనీయాంశంగా మారింది. ఈ హోటల్ లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరు. హెరిటేజ్ లైన్స్‌పై నిర్మించిన ఈ హోటల్.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చాలా మందిని దీనికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో అనేక రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గదుల అద్దె సాధారణంగా రూ.30-40 వేల నుండి మొదలవుతుంది. అయితే, గదులు అనేక కేటగిరీలలో అందుబాటులో ఉంటాయి. అయితే, 30, 40 వేలు తొలి దశలో మాత్రమే. ఆ తరువాత గదులను బట్టి ధరల పట్టికలు కూడా మారుతుంటాయి.

ఏ గది స్పెషల్..? అయితే, ఈ హోటల్‌లో ఒక ప్రత్యేక గది ఉంది. దీనిని సుఖ్ నివాస్ అని పిలుస్తారు. ఈ గది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అంతేకాదు.. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ గదులలో ఒకటిగా పేరుగాంచింది. దీనిలో స్టే చేయాలంటే ఒక రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని ప్రెసిడెన్షియల్ రూమ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది తాజ్ హోటల్స్‌లో భాగం ఇది.

ఈ గది ప్రత్యేకత ఏంటి? ఈ గది రాచరిక శైలికి ప్రసిద్ధి చెందింది. దాని ఫోటోలను బట్టి చెప్పొచ్చు.. ఆ గదిలో ఉండటం ఎంత ప్రత్యేకమో. ఎంట్రీ రూట్ మొదలు.. తోట, మొక్కలు, పూల వనాలు కలిగిన ఈ గది పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రాయల్ డైనింగ్ రూమ్ సహా, డ్రెస్సింగ్ రూమ్, మాస్టర్ బెడ్ రూమ్‌ కలిగి ఉంది. ఈ గదిలో స్టే చేస్తే మహారాజు అనుభూతిని పొందుతారు. అందుకే ప్రముఖులందరూ ఈ గదిలో ఉండేందుకు ఇష్టపడుతారు.

ఒక్క రోజు రెంట్ ఎంత? ఇక ఛార్జీల విషయానికి వస్తే సామాన్య ప్రజలు దీని రెంట్ తెలుసుకుంటే హడలిపోతారు. దీని రెంట్.. సమయానుగుణంగా మారుతుంటుంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ గది ఒక రోజు రెంట్ సుమారు రెండున్నర లక్షల రూపాయలు. కానీ, కొన్నిసార్లు దీనికి డిమాండ్ పెరిగినప్పుడు ఒక రోజు రెంట్ రూ. 10 లక్షల వరకు ఉంటుంది.

Also read:

Rape Victim Suicide: బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రేపిస్ట్.. విషయం తెలిసి బాధితురాలు ఏం చేసిందంటే..?

Kamala Harris: కమలా హారిస్‌ను చంపేందుకు 53వేల డాలర్ల ఒప్పందం.. కోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితురాలు..

Crime News: పెళ్లి పేరుతో వంచన.. ఫోటోలు చూసి కనెక్ట్ అయ్యోరో అంతే సంగతులు.. షాకింగ్ క్రైమ్ స్టోరీ..