Crime News: పెళ్లి పేరుతో వంచన.. ఫోటోలు చూసి కనెక్ట్ అయ్యోరో అంతే సంగతులు.. షాకింగ్ క్రైమ్ స్టోరీ..

Crime News: మ్యాట్రిమోనీ ఆధారంగా అమ్మాయిలకు వల విసిరి.. ఆపై అందినకాడికి దోచుకుంటున్న ఓ ఘరానా మోసగాడి బాగోతం బట్టబయలైంది.

Crime News: పెళ్లి పేరుతో వంచన.. ఫోటోలు చూసి కనెక్ట్ అయ్యోరో అంతే సంగతులు.. షాకింగ్ క్రైమ్ స్టోరీ..
Arrest

Crime News: మ్యాట్రిమోనీ ఆధారంగా అమ్మాయిలకు వల విసిరి.. ఆపై అందినకాడికి దోచుకుంటున్న ఓ ఘరానా మోసగాడి బాగోతం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో వెలుగు చూసిన ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడుని అప్పటికే ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని గుర్తించారు జగ్గయ్యపేట పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వియవాడకు చెందిన వంశీకృష్ణ.. ఖమ్మం జిల్లాలో జీవనం సాగిస్తున్నాడు. అయితే, సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పెళ్లి కాని అమ్మాయిలే లక్ష్యంగా మోసాలకు తెరలేపాడు. ఈ క్రమంలో మ్యాట్రిమోనీలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. అమ్మాయిలకు వల విసిరేవాడు. అలా పెళ్లి పేరుతో వారిని వంచన చేసేవాడు. వివాహం, విహారం పేరుతో డబ్బులు గుంజేవాడు. ఇలా మ్యాట్రిమోనీలో పెళ్లి పేరుతో ఐదుగురు అమ్మాయిలను పరిచయం చేసుకుని, మాయ మాటలతో అరకోటి స్వాహా చేసుకున్నాడు.

పెళ్లి కాని అమ్మాయిలనే టార్గెట్‌గా చేసుకుని మ్యాట్రిమోనీలో అందమైన యువకుల ఫోటోస్‌తో ఫేక్ ఐడీ క్రియేట్ చేస్తాడు. ఆ ఫోటోను చూసి ఎవరైనా వీడికి కనెక్ట్ అయ్యారో అంతే సంగతలు. వారిని మాయ మాటలతో బురిడీ కొట్టిస్తాడు. తనతో కనెక్ట్ అయిన అమ్మాయిల వద్ద నుంచి డబ్బులు కొట్టేయడానికి తనవద్ద ఉన్న టెక్నిక్స్ అన్నీ ఉపయోగిస్తాడు. అమ్మాయిలకు తన మాటలతోనే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. పెళ్లి అవగానే విదేశాలకు వెళ్దాం అంటూ అమ్మాయిలలో ఆశలు రేకెత్తిస్తాడు. అయితే, విదేశాలకు వెళ్లాలంటే వీసా కావాలి, అందుకు డబ్బులు కావాలని నమ్మబలుకుతాడు. ఆ డబ్బుల కోసం అతనే ఉపాయం కూడా చెబుతాడు. మన డబ్బులను మనమే సమకూర్చుకుందాం.. తిరిగి మనమే తీర్చేద్దాం అంటూ ఊదరగొడతాడు. మన భవిష్యత్తు కోసమే ఈ ప్లాన్ అంటూ వారిని అడ్డంగా నమ్మి్స్తాడు. అలా ఆన్‌లైన్‌లో రుణాలకు అప్లై చేస్తాడు. బాధిత అమ్మాయిల ఐడీ ప్రూఫ్‌లనే రుణాల కోసం పెడతాడు. అయితే, వాటి మాయ మాటలను పూర్తిగా విశ్వసించిన బాధిత అమ్మాయిలు.. తమ అకౌంట్‌లో పడ్డ అమౌంట్ మొత్తాన్ని వాడి అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అలా డబ్బులు వాడి అకౌంట్‌లో పడటమే ఆలస్యం.. ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇలా వాడి మ్యాట్రిమోని మోసాలను సాగిస్తూ వచ్చాడు.

అయితే, తాజాగా జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతిని వంశీ కృష్ణ ఇలాగే మోసం చేయగా.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడైన వంశీకృష్ణ కోసం వెతుకుతూ ఖమ్మం కు వెళ్లగా.. అప్పటికే అతను అరెస్టై ఖమ్మంలోని చల్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అది తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. నిందితుడు వంశీ కృష్ణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదుగురు మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క యువతి వద్ద బంగారంతో సహా రూ. 10 లక్షల వరకు స్వాహా చేశాడు. హైదరాబాద్‌లో నలుగురు, జగ్గయ్యపేటలో ఒకరిని మోసం చేశాడు వంశీకృష్ణ.

అయితే, ఇంతటి మోసాలకు పాల్పడుతునన వంశీకృష్ణ.. తాను చేస్తున్న మోసానికి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఎవ్వరికీ చిక్కకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. కానీ, ఓ కొత్త కారు కొని దాని రిజిస్ట్రేషన్ నెంబర్‌తో పట్టుబడ్డాడు. కాగా, ఇప్పటి వరకైతే ఐదుగురు మహిళలే వాడి చేతిలో మోసపోయినట్లు తేలింది. ఇంకా ఎంతమంది వాడి చేతిలో మోసపోయారో తెలియాల్సి ఉంది. వంశీకృష్ణతో పాటు.. అతనికి సాయం చేసిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also read:

Telangana Crime: గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చారు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యారు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Srisailam-Nagarjuna Sagar : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా శ్రీశైల, నాగార్జునసాగర్ జలాశయాలు.. పూర్తి వివరాలివే..

Telangana News: నేడు నిర్మల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎల్లపల్లి సభ వేదికగా యుద్ధం ప్రకటిస్తారా?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu