Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saidabad Raju: రాజును చూశా.. రూ10 లక్షలు ఇచ్చేస్తారా..?.. ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిస్తే షాక్ తింటారు

స్టేషన్ ఘన్‌పూర్-వరంగల్ మధ్య నష్కల్ దగ్గర్లో రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రైల్వేట్రాక్‌పై రాజు శవాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Saidabad Raju: రాజును చూశా.. రూ10 లక్షలు ఇచ్చేస్తారా..?.. ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిస్తే షాక్ తింటారు
Crime Raju
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2021 | 10:16 AM

సైదాబాద్​ హత్యాచార నిందితుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలిపేందుకు పోలీసులు నంబర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటికి వచ్చిన ఫోన్‌కాల్స్‌ మరీ దారుణంగా ఉన్నాయి. “సర్.. ఇప్పుడే కనిపించాడు. పట్టుకునే లోపు మాయమయ్యాడు. రూ. 10 లక్షలు ఇచ్చేస్తారా”, “గంజాయి కావాలి.. తెచ్చిస్తారా..?”, “సర్‌.. ఫలానా దగ్గర రాజు కనిపించాడు. అరెస్ట్‌ చేస్తారా..? రూ.10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?”.. ఇలాంటి కాల్స్ పోలీసులు రిసీవ్ చేసుకున్నారు. ఇలా ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిస్తే మీరు షాక్ తింటారు. ఏకంగా 5 వేల కాల్స్ వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీటిలో దాదాపు అన్నీ ఫేక్ కావడంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. రాజు గురించి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. అయితే కొందరు ఈ ఫోన్‌ నంబర్లు నిందితుడివే అనుకొని కాల్ చేసి.. లిఫ్ట్ చేసిన వెంటనే తిట్టడం ప్రారంభించారు. మరికొందరైతే ఏకంగా గంజాయి ఉందా అని అడిగారు. తొలుత ప్రతి కాల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత అవతలి వ్యక్తి చెబుతోన్న సమాచారం నమ్మదగినదిగా అనిపిస్తేనే రంగంలోకి దిగారు. చివరికి నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగిసింది.

రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా అతని కుటుంబ సభ్యులు మాత్రం విషాదంలో మునిగిపోయారు. ఉన్న ఒక్క దిక్కును కోల్పోయామని తమకూ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుతున్నారు. రాజు భార్య మౌనిక, అతని తల్లి గుండెలవిసేలా రోధిస్తున్నారు. రాజు సూసైడ్ చేసుకోలేదని…. పోలీసులే చంపేశారని ఆరోపించారు. ఉన్న ఇల్లు కూల్చేశారు. ఒంటి మీద బట్టలు తప్ప ఊళ్లో మాకంటూ ఏమీ లేదని వాపొయారు. తనకు 11 నెలల కూతురు ఉందని.. ఇప్పుడు తమకు దిక్కెవరు రాజు భార్య మౌనిక కన్నీరు పెడుతోంది.

రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్య

స్టేషన్ ఘన్‌పూర్-వరంగల్ మధ్య నష్కల్ దగ్గర్లో రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రైల్వేట్రాక్‌పై రాజు శవాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు. చేతిపై మౌనిక అనే పేరుతో టాటూ గుర్తించిన పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండటంతో… ఇక తప్పించుకోలేని పరిస్థతుల్లో అతను రైలు కింద పడి సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

Also Read: Hyderabad: 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష

ఉద్యోగిని మద్యం తాగి ఆఫీసుకు వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేశారు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్