Viral News: ఉద్యోగిని మద్యం తాగి ఆఫీసుకు వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేశారు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్

అది ఏ ఆఫీస్ అయినా సరే.. ఉద్యోగి మద్యం సేవించి వస్తే అస్సలు సహించరు. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేయడమో, మెమో జారీ చేయడమో చేస్తారు.

Viral News: ఉద్యోగిని మద్యం తాగి ఆఫీసుకు వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేశారు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
Women Drinks Liquor
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2021 | 9:19 AM

అది ఏ ఆఫీస్ అయినా సరే.. ఉద్యోగి మద్యం సేవించి వస్తే అస్సలు సహించరు. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేయడమో, మెమో జారీ చేయడమో చేస్తారు. తాజాగా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో అలాంటి ఘటనే జరిగింది.  షిఫ్ట్ కి 9 గంటల ముందు మద్యం సేవించినందుకు ఒక మహిళా ఉద్యోగిని జాబ్ నుంచి తీసేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తనకు అన్యాయం జరిగిందని.. తప్పు లేకపోయినా తనను జాబ్ నుంచి తీసేశారని సదరు మహిళ కోర్టుకు వెళ్లింది. దీంతో చివరకు అదే కంపెనీ ఆ మహిళకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళకు ఈ ఇన్సిడెంట్ ఎదురైంది. మీడియా నివేదికల ప్రకారం, ఆ మహిళ ఓ కంపెనీలో పనిచేసేది. ఓ సారి ఆఫీసుకు వెళ్లినప్పుడు, ఆమె వద్ద మద్యం వాసన వచ్చింది. ఆమె తన 2 గంటల షిఫ్ట్‌కు 9 గంటల ముందు అంటే ఉదయం 5 గంటల  సమయంలో మద్యం సేవించింది.

అయితే సదరు కంపెనీ పాలసీ ప్రకారం,  డ్యూటీకి వచ్చే ఉద్యోగులు మద్యం తాగకూడదు. ఆల్కహాల్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న కంపెనీ.. ఉద్యోగులు మద్యం సేవించి ఆఫీసుకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో సదరు మహిళ వద్ద లిక్కర్ స్మెల్ రావడంతో జాబ్ నుంచి తీసేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన విషయమే చాలా చిత్రంగా ఉంది.

జాబ్ నుంచి తొలగించిన మహిళ అదే కంపెనీలో 11 సంవత్సరాలు పనిచేస్తోంది. ఆమె బ్రీఫింగ్ ఇస్తున్న సమయంలో, మద్యం సేవించారా అని మేనేజర్ అడిగాడు. అవును అని సమాధానం వచ్చిన వెంటనే, ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. ఆమెకు తన వెర్షన్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ చట్టాన్ని ఆశ్రయించింది. తాను షిఫ్ట్‌కు 9 గంటల ముందు మాత్రమే మద్యం సేవించినట్లు విన్నవించింది. దీంతో కోర్టులో ఆమెకు అనుకూలంగా వచ్చింది. ఆ మహిళకు పరిహారంగా 5454 యూరోలు అంటే సుమారు రూ. 5 లక్షల 50 వేలు ఇవ్వాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. దీంతో ఆమె తొలగించిన అదే కంపెనీ నుంచి ఈ మొత్తాన్ని పొందింది.

Also Read:  9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష

హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం.. సూర్యకిరణాలు తాకిన అనంతరం

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ