Srisailam-Nagarjuna Sagar : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా శ్రీశైల, నాగార్జునసాగర్ జలాశయాలు.. పూర్తి వివరాలివే..

Srisailam-Nagarjuna Sagar : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలలో కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దాంతో కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయి.

Srisailam-Nagarjuna Sagar : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా శ్రీశైల, నాగార్జునసాగర్ జలాశయాలు.. పూర్తి వివరాలివే..
Nagarjuna Sagar
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2021 | 9:27 AM

Srisailam-Nagarjuna Sagar : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలలో కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దాంతో కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకి భారీ వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దాంతో జూరాల జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుకు 1లక్ష 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 20 గేట్లను ఎత్తా నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో 1లక్ష 69 వేల క్యూసెక్కుల నీరు దిగువన శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతోంది. ఇక జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలో ఐదు యూనిట్ల ద్వారా 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.920 మీటర్లుగా ఉంది. కాగా, ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో, కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

జలకళతో శ్రీశైలం జలాశయం.. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు.. జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌‌కు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,25,819 క్యూసెక్కులు కాగా, ఔట ఫ్లో 1,98,996 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మేర నీరు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

తుంగభద్ర జలాశయం.. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండుకుండగా ఉండటంతో.. 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 45,983 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 31,239 క్యూసెక్కులు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1632.88 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 100.393 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివరాలు.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దాంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వరద వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 2,16,137 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో: 1,33,137 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 589.70 అడుగులు. పూర్తిస్థాయి సామర్థ్యం : 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ : 311.1486 టీఎంసీలు

Also read:

Crime News: వేట కోసం వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత.. భయంతో పూడ్చిపెట్టిన దుండగులు.. ఆ తర్వాత

Manchu Manoj: దేవుడు ఉన్నాడు.. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే: మంచు మనోజ్

Viral News: ఉద్యోగిని మద్యం తాగి ఆఫీసుకు వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేశారు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్