Crime News: వేట కోసం వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత.. భయంతో పూడ్చిపెట్టిన దుండగులు.. ఆ తర్వాత

Shaik Madarsaheb

Shaik Madarsaheb | Edited By: Phani CH

Updated on: Sep 17, 2021 | 9:20 AM

Two Bodies found in Forest area: తెలంగాణలోని కొమరం భీ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. జంతువుల కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన

Crime News: వేట కోసం వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత.. భయంతో పూడ్చిపెట్టిన దుండగులు.. ఆ తర్వాత
Two Bodies Found In Forest

Follow us on

Two Bodies found in Forest area: తెలంగాణలోని కొమరం భీ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. జంతువుల కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే వణ్యప్రాణుల వేటగాళ్లు.. భయంతో ఆ మృతదేహాలను ఎవరికీ తెలియకుండా అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు. ఈ సంఘటన కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం విలేజ్లోని నెం ఆరు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామం సమీపంలోని పొలం వద్ద వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. అయితే.. గమనించని ఇద్దరు యువకులు వేట కోసం అటుగా వెళ్తూ.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

అనంతరం ఇది గమనించిన వేటగాళ్లు.. ఈ విషయం బయటికి తెలిస్తే ఏమవుతుందోననే భయంతో ఆ మృతదేహాలను అటవీ ప్రాంతంలోనే పాతిపెట్టారు. మృతులు గన్నారం గ్రామానికి చెందిన సత్తయ్య, దుర్గారాజ్‌గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకులు.. వేరే వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగల కారణంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన అనంతరం పోలీసులు పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్గాం పోలీసులు వెల్లడించారు.

Also Read:

Saidabad Incident: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు అంత్యక్రియలు.. భారీ బందోబస్తు మధ్య పూర్తి

Raj Kundra Case: నేను చాలా బిజీ అతనేం చేస్తున్నాడో నాకు తెలీదు.. తన భర్త గురించి శిల్పాశెట్టి సంచలన వాంగ్మూలం!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu