Telangana Crime: గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చారు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యారు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Telangana Crime: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా

Telangana Crime: గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చారు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యారు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అడపా దడపా నకిలీగాళ్లు పడుతున్నారు.
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2021 | 9:49 AM

Telangana Crime: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా హాశిష్ ఆయిల్‌(గంజాయి) ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ ఈ స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి 9,80,800 రూపాయల విలువ చేసే 3 లిటర్ల హాశిష్ ఆయిల్( గంజాయి ), ఒక బైక్, 3 సెల్ ఫోన్స్, రూ. 800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కాగా, నిందితులు మల్లప్పగిరి శ్రీకాంత్ రెడ్డి (32), చాకలి వెంకటేష్ (27), తర్లవలసకోండల్ రావు (43) లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించగా.. మరో నిందితుడు మున్నపాక వెంకట్ రాజు(32) సప్లయర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతన్ని కూడా త్వరలోనే పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని సీపీ తెలిపారు. గంజాయి స్మగ్లింగ్‌ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. కాగా, ఈ సగ్మింగ్‌ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

నల్ల కుబేరులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో మోదీ చేతికి స్విస్‌ బ్యాంక్‌ థర్డ్‌ లిస్ట్‌..!! వీడియో

Srisailam-Nagarjuna Sagar : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా శ్రీశైల, నాగార్జునసాగర్ జలాశయాలు.. పూర్తి వివరాలివే..

Crime News: వేట కోసం వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత.. భయంతో పూడ్చిపెట్టిన దుండగులు.. ఆ తర్వాత