Manchu Manoj: దేవుడు ఉన్నాడు.. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే: మంచు మనోజ్

Manchu Manoj Comments: హైదారాబాద్‌లోని సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం, హత్య అనంతరం.. ఉన్మాది పట్టుకునేందుకు వేలాది మంది పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో

Manchu Manoj: దేవుడు ఉన్నాడు.. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే: మంచు మనోజ్
Manchu Manoj
Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Sep 17, 2021 | 9:19 AM

Manchu Manoj Comments: హైదారాబాద్‌లోని సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం, హత్య అనంతరం.. ఉన్మాది పట్టుకునేందుకు వేలాది మంది పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రాజు రైల్వే ప‌ట్టాల‌పై శ‌వ‌మై కనిపించ‌డంతో నెటిజ‌న్స్, ప‌లువురు సెల‌బ్రిటీలు సంతోషం వ్యక్తంచేస్తూ.. సోషల్‌ మీడియాలో పలు సందేశాలను పంచుకుంటున్నారు. ఈక్రమంలో మంచు మనోజ్‌ కూడా ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. మంచు మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ”ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే.. ఇలాంటి నీచమైన పనులు చేసిన ఎవరికైనా జరగాల్సిందే.. జరగాలి అంటూ మంచుమనోజ్‌ పేర్కొన్నారు. చిన్నారి ఎక్కడున్న తన ఆత్మశాంతిస్తుందని.. ఈశ్వరుడిని కోరుకుంటున్నానంటూ మంచుమనోజ్‌ పేర్కొన్నారు. చిన్నారి తల్లిదండ్రులకూ ఏం చేసినా.. కూతురు మాత్రం తిరిగిరాదంటూ మనోజ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు ఆడ పిల్లల తల్లిదండ్రుల్లో చిన్న భరోసా వచ్చింది” అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు నటుడు మంచు మనోజ్‌ కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు నిమిషాలకు పైగా ఉన్న వీడియోను విడుదల చేశారు.

అయితే.. అంతకుముందు మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సినీ న‌టుడు మంచు మ‌నోజ్ కుమార్‌.. ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ స‌ర్.. దేవుడు ఉన్నాడంటూ మంచు మనోజ్‌ రీట్విట్‌ చేశారు. కాగా.. ఈ ఘటన అనంతరం మంచు మనోజ్ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచ‌కుడు రైల్వే ప‌ట్టాల‌పై శ‌వ‌మై కనిపించిన విషయం తెలిసిందే. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలోని రైల్వే ట్రాక్‌పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శ‌రీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా గుర్తించిన‌ట్లు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉన్మాది అంత్యక్రియలను కూడా నిర్వహించారు.

Also Read:

Saidabad Incident: సింగరేణి చిన్నారి ఘటనలో నిందితుడు రాజు అంత్యక్రియలు.. భారీ బందోబస్తు మధ్య పూర్తి

Singareni Colony: సింగరేణి కాలనీ నిందితుడు రాజు ఆత్మహత్యతో టపాసులు పేల్చి, సంబురాలు జరపుకున్న స్థానిక మహిళలు