Singareni Colony: సింగరేణి కాలనీ నిందితుడు రాజు ఆత్మహత్యతో టపాసులు పేల్చి, సంబురాలు జరపుకున్న స్థానిక మహిళలు
సైదాబాద్ సింగరేణికాలనీ నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
Singareni Colony Women Celebrations: సైదాబాద్ సింగరేణికాలనీ నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన జనం పెద్ద ఎత్తున సింగరేణికాలనీకి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కాలనీలో టపాసులు పేల్చ సంబురాలు జరుపుకున్నారు స్థానిక మహిళలు.. వారం రోజుల నుండి నిందుతుడి ఆచూకీ లభించకపోవడంతో బాధపడం.. ఇప్పుడు చనిపోయాడని తెలియడం సంతోషంగా ఉంది.. పాప ఆత్మకు శాంతి కలిగినట్టుగా ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు, నిందితుడు రాజు చనిపోయినా…జనాగ్రహం తగ్గడం లేదు. వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ…వాడి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావాలని కోరుతున్నారు. మరికొందరేమో చనిపోయింది అస్సలు రాజు కాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపంతో రగిలిపోయిన స్థానికులు అదేకాలనీలో ఉన్న రాజు ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో సింగరేణికాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలను కూడా మార్చి..ఇలాంటి నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చూడాలంటున్నారు.సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈనెల 9న మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. గత ఏడు రోజుల నుంచి నిందితుడు రాజు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. రాజును పట్టుకునేందుకు 70 బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఈ నెల 9వ తేదీన సైదాబాద్‌లో చిన్నారిపై రాజు హత్యాచారం చేశాడు. నాటి నుంచి రాజు కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. ఇక, అన్ని వైన్ షాపుల వద్ద నిందితుడు రాజు ఫోటోను ఉంచి నిఘా పెట్టారు. బస్సులు, ఆటోలపై రాజు ఫోటోలు ప్రదర్శించి.. అతని ఆచూకీ కోసం విస్తృతంగా తనిఖీలు చేశారు. రాజు నిన్న ఉప్పల్ ప్రాంతంలో సంచరించినట్లు అనుమానించారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఎట్టకేలకు నిందితుడు రాజు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. Read Also….