Today in History: సెప్టెంబర్ 17.. చరిత్రలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు.. మరెన్నో ఘటనలు..
PM Modi Birthday:సెప్టెంబర్ 17వ తేదీకి చరిత్రలో ఎంతో విశిష్టత వుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 17వ తేదీకి చరిత్రలో చాలా ప్రత్యేకత ఉంది. తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. వావిలాల గోపాలకృష్ణయ్య, సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం ఈ రోజు అంతే కాకుండా భారత14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం కూడా ఈ రోజే… ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
చరిత్రలో సెప్టెంబర్ 17..
సంఘటనలు
1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
జననాలు
1906: వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (మరణం.2003)
1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడు. (మరణం.2011)
1925: రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి జననం.
1929: భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం (మరణం.2011).
1930: కర్ణాటక సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం (మరణం.2013).
1937: భారతీయ కవి, సాహిత్య విమర్శకుడు సీతాకాంత్ మహాపాత్ర జననం.
1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త
1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు.
1990: బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు.
? మరణాలు ?
1922: ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాశారు (జననం.1888).
పండుగలు , జాతీయ దినాలు..
తెలంగాణ విమోచన దినోత్సవం
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన రోజు అది. అందేకే ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
విశ్వకర్మ జయంతి
హిందూ పురాణాల ప్రకరాం రుగ్వేదంలో, క్రిష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారు. ఆధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా పేర్కొనబడ్డారు. పురుష సూక్తంలో విరాట పురుషుడిగా కీర్తి గడించాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడిగా అన్ని వేదాల్లోనూ ప్రస్తావించబడిన వ్యక్తే విశ్వకర్మ. దేవ వాస్తుశిల్పి విశ్వకర్మని కొలుస్తూ పూజలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17న దేశ వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..