AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?

PM Narendra Modi Birthday:భారత ప్రధానిగా ఎన్నికైన నాటినుంచి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ముందుకుసాగుతున్నారు.

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?
Pm Narendra Modi Birthday
Follow us
Venkata Chari

|

Updated on: Sep 17, 2021 | 10:35 AM

PM Narendra Modi Birthday: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా మోడీ బాల్యాన్ని ఓసారి చూస్తే.. అతను గొప్ప నాయకుడిగా ఎలా గుర్తింపు పొందాడో అర్థమవుతుంది. భారత ప్రధానిగా ఎన్నికైన నాటినుంచి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ముందుకుసాగుతున్నారు. అనేక పుస్తకాలు, అతని స్నేహితులు వివరించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.

బాల్యం.. దామోదర్దాస్ ముల్‌చంద్ మోడీ, హీరాబెన్ మోడీ దంపతులకు సెప్టెంబర్ 17, 1950న జన్మించారు. బాగా పేదరికంలో పెరిగిన మోడీ, పేదోడిగా ఉండడానికి మాత్రం నిరాకరించారు. ఆరు దశాబ్దాల క్రితం గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఒక పేద బాలుడు, పట్టుదల, వ్యూహాత్మక ఆలోచనతో భారత ప్రధానికిగా ఎదిగిన విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

కబడ్డీ మ్యాచ్.. మోడీ చదువుకున్న వాద్‌నగర్‌లోని బీఎన్ హైస్కూల్‌లో రెండు జట్ల మధ్య ఇంట్రా స్కూల్ కబడ్డీ మ్యాచ్ జరిగింది. అందులో ఒక జట్టు చిన్న పిల్లలతో ఉండడంతో ప్రతీసారి ఓడిపోతుంది. అయితే, ఓ వ్యూహాన్ని రూపొందించాలంటూ మోడీని కోరారు. అవతలి జట్టు ఆధిపత్యానికి గల కారణాలు మోడీ అధ్యయనం చేయడం ప్రారంభించారు. వారి గెలుపు రహస్యాలను గుర్తించారు. వీటితో తన సొంత జట్టుకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో తరువాత మ్యాచులో మోడీ జట్టు విజయం సాధించింది. చిన్ననాటి మోడీ లాగే.. ప్రస్తుతం ప్రతిపక్షాల ఎజెండాను తెలుసుకుని మలుచుకుని వారికి షాక్ ఇస్తూ ఉంటారు. 2014 లోక్ సభ ఎన్నికట్లో మోడీ అద్భుత విజయం సాధించాడానికి ముందు, బీజేపీ పట్టణ, మధ్య తరగతి ఓటర్ల పార్టీగా భావించారు. ప్రతిపక్షం, ప్రాంతీయ పార్టీల సామాజిక న్యాయం ఎజెండాను స్వీకరించడం ద్వార మోడీ ఈ ఇమేజ్‌ను మార్చారు.

అంటరానితనంపై తిరుగుబాటు.. ఇది మోడీ పాఠశాలలో రాసిన, ప్రదర్శించిన నాటకం పేరు. అంటరాని మహిళపై పూజారి అరుస్తుండడం చూసి మోడీ ఈ నాటకం రాసినట్లు చెబుతుంటారు. అంటరాని వ్యక్తిగా ఉన్నందున ఆలయంలోకి ప్రవేశించలేని ఒక మహిళ దుస్థితిని ఈ నాటకం హైలైట్ చేసింది. మోదీ తెలి ఘాంచీ అనే తక్కువ కులం నుంచి వచ్చారు. సామాజిక న్యాయంపై అతని వైఖరి బీజేపీకి తక్కువ కులాల ఓట్లను సంపాదించడానికి సహాయపడింది. పార్టీలో మోడీ టేకప్ చేసిన తరువాత బీఆర్ అంబేద్కర్ పార్టీకి ముఖ్యమైన చిహ్నంగా మారారు.

మొసళ్లతో ఆట.. చైల్డ్‌వుడ్ స్టోరీస్ – బాల్ నరేంద్ర’, మోడీ జీవితంపై ఇది ఒక హాస్య పుస్తకం. అతని ధైర్యానికి ఎన్నో ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. భయమెరుగని మోడీ మొసళ్లతో ఆడుకునేవారు. ఒకసారి ఒక మొసలి పిల్లను ఇంటికి తీసుకువచ్చారు. కానీ, అతని తల్లి అభ్యంతరం చెప్పడంతో దానిని తిరిగి సరస్సులో వదిలిపెట్టారు. ఒక దేవాలయంపైన జెండాను ఎగురవేయడానికి మొసలి బారినపడిన సరస్సు గుండా ఈదుకుంటూ వెళ్లారు. మరోసారి గాలిపటం తీగలలో చిక్కుకున్న పక్షిని విడిపించడానికి తన దంతాల మధ్య బ్లేడ్‌తో చెట్టుపైకి ఎక్కారు. రిస్క్ తీసుకోవటానికి భయపడని భవిష్యత్ నాయకుడిగా ఎదగడంలో ఇవి ఎంతగానో సహాయపడ్డాయి. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌కి మోదీ ఆమోదం అనేది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే ప్రమాదకర చర్యే అయినా.. నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

రైల్వే స్టేషన్‌లో జీవితం.. వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మే తన తండ్రికి మోడీ సాయం చేసేవారు. బహిరంగ ప్రసంగాలలో అప్పుడప్పుడు టీ అమ్ముతున్న రోజుల గురించి తరచుగా మాట్లాడుతుంటారు. రైల్వే స్టేషన్‌‌లో మోడీ జీవితం.. రైల్వేలను పునరుద్ధరించడానికి ప్రేరేపించి ఉండవచ్చని అంటుంటారు. రైల్వేలను మార్చాలనే తన ప్రతిష్టాత్మక మిషన్‌కి మోడీ అపరిమితమైన అంకితభావం చూపించారు.

17 ఏళ్ల వయసులోనే దేశ పర్యటన.. 17 ఏళ్ల వయసులోనే దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా , డార్జిలింగ్ వరకు తిరిగారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఆల్మోరా కు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ల వయస్సులో ఉత్తరభారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరికతో మారిన జీవితం మోదీ పర్యటన ముగించుకుని స్వగ్రామమైన వాద్‌నగర్‌కి చేరుకుని, తల్లి దగ్గర దీవెనలు తీసుకొని అహ్మదాబాద్‌లో తన మేనమామ రన్ చేస్తున్న ఆర్.టి.సి క్యాంటీన్‌లో పని చేసేవారు. తన గురువు వకీల్ సాబ్ ద్వారా ఆర్ఎస్ఎస్‌లోకి ప్రవేశించారు. వకీల్ సాబ్ అనుచరుడిగా తక్కువ కాలంలోనే అందరికి సుపరిచితులయ్యారు. మోడీ ఆధ్వర్యంలో సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్‌లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. దీంతో కీలక బాధ్యతలు మోడీకి అప్పగించారు. 1975లో ఎమెర్జెన్సీ సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులకు రహస్యంగా దాచి పెట్టే లాంటి వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఎమెర్జెన్సీ సమయంలో గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థులను విజయవంతంగా నడిపించారు. ఎమెర్జెన్సీ తరువాత సంఘ్‌లో కీలక పదవులు అధిరోహించారు.

రాజకీయ జీవితం.. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తున్న సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యారు. 1986లో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అద్వానీ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఇలా గుజరాత్‌‌ బీజేపీలో కీలక వ్యక్తిగా మారారు. 1995లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు కీలకంగా మారారు. ఆ తరువాత గుజరాత్ అసెంబ్లీ విజయంతో మోడీ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు అద్వానీ.. ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించారు. ఆయా రాష్ట్రాల ఇంఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. దీంతో బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది.

ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పనిచేశారు. మొత్తం నాలుగు సార్లు గుజరాత్ సీఎంగా మోడీ పనిచేశారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన మోడీ తిరుగులేని విజయం సాధించి తొలిసారి 2014 మే 21న భారత 15వ పీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. అందులో 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అధికరణ 370 రద్దు, మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా(NRC) అమలు వంటివి మచ్చుకు కొన్ని ఉన్నాయి.

కాంగ్రెసేతర తొలి ప్రధానిగా రికార్డు దేశంలో ఎక్కువకాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ(71) రికార్డు సృష్టించారు. గతంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట ఈ రికార్డు ఉంది. వాజ్‌పేయి మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై మొత్తం 2,272 రోజులు దేశ ప్రధానిగా పనిచేశారు. నరేంద్ర మోడీ 2022 ఆగస్టు 13న వాజ్‌పేయిని అధిగమించారు. రెండు దఫాలుగా ఇప్పటి వరకు 2,686 రోజులు దేశ ప్రధానిగా సేవలందించారు.

Also Read: Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆ సాహసం చేస్తారా? యూపీలో అక్కడి నుంచి పోటీచేస్తారా?

Bears Visit Temple: ఛత్తీస్‌ఘడ్ చండీ దేవాలయంలో అద్భుతం.. పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు

Gujarat Cabinet Minister: 24 మంది మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కొత్త కేబినెట్