Bears Visit Temple: ఛత్తీస్‌ఘడ్ చండీ దేవాలయంలో అద్భుతం.. పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు

చత్తీస్‌ఘడ్ బాగా బహారా అటవీ ప్రాంతంలో చండీ దేవాలయంలో అద్భుతం.. ఇక్కడ మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటాయి.

Bears Visit Temple: ఛత్తీస్‌ఘడ్ చండీ దేవాలయంలో అద్భుతం.. పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు
Bear Visit Chandi Mata Mandir
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 16, 2021 | 6:00 PM

Bear comes to Temple for prey: చత్తీస్‌ఘడ్ బాగా బహారా అటవీ ప్రాంతంలో చండీ దేవాలయంలో అద్భుతం.. ఇక్కడ మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటాయి..దేవాలయంలో పూజారి శంఖం పూరిస్తే చాలు వెంటనే అక్కడికి చేరుకుంటాయి ఎలుగుబంట్లు.. అర్చకులు ఎలుగుబంట్లకు తీర్థప్రసాదాలు అందిస్తారు.. భక్తులు ఇచ్చే ఫలహారాలు సైతం ఎలుగుబంట్లు స్వీకరిస్తాయి.. చత్తీస ఘడ్ రాష్ట్రం బస్తర్ ఎన్నో రహస్య అందాలకు చారిత్రాత్మక విశేషాలకు నెలవు.. జలపాతాలు ,చారిత్రాత్మక ప్రదేశాల చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతం సొంతం.. అడవులు సంచరించే మృగాలు దేవాలయాలకు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాయి..

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మహ సముంద్ జిల్లాలోని చండి మాత భక్తులు అయినా ఎలుగుబంట్లు ఆలయానికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇక్కడి విశేషం..ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం మహా సముందు జిల్లా బాగబాహార అనే గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టపైన “చండీ దేవి” ఆలయం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. గుడికి దగ్గరలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో అనేక రకాలైన క్రూర జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఎక్కువుగా ఎలుగు బంట్లు సంచరించే ప్రదేశం కావడం మరో విశేషం. ఈ గుడికి సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుండి నిత్యం ప్రతీ రోజు ఎలుగుబంట్లు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ పూజారి పెట్టిన ప్రసాదాలను తిని వెళ్తున్నాయి. అంతేకాదు భక్తులు పెట్టిన ఆహార పదార్దాలు, పానీయాలు త్రాగి వాటి అంతట అవే తిరిగి అడవిలోకి వెళ్తూ ఉంటాయి.

ప్రతీ రోజు గుడిలో పూజా కార్యక్రమాల అనంతరం, హారతి పూర్తి కాగానే, గుడిలో పూజారి శంఖం ఊదటం ఆనవాయితీ.. శంఖం ఊదిన కొద్దిసేపటికే ఎలుగుబంట్లు గుంపులుగా.. విడివిడిగా అడవిలో ఎక్కడ ఉన్న సరే అరుచుకుంటూ అమ్మవారి గర్భాలయంలోకి వచ్చేస్తాయి. అమ్మవారి సన్నిధిలో అక్కడ ఉన్న భక్తులను కానీ పూజారిని కానీ ఇప్పటివరకు దాడి చేసినట్టు కానీ ,గాయపరిచిన దాఖలాలు లేవు. కానీ, అవి అమ్మవారి సన్నిధి దాటి అటవీ ప్రాంతానికి వెళ్లిన తర్వాత మాత్రం క్రూర జంతువులు లాగానే ప్రవర్తిస్తాయని అక్కడి భక్తులు చెపుతున్నారు. క్రూర జంతువులు అప్పుడు అప్పుడు పులులు, చిరుత పులులు, నక్కలు సైతం చండి దేవి ఆలయానికి వచ్చి వెళుతుంటాయని పూజారులు తెలిపారు.

ముఖ్యంగా క్రూర జంతువులలో ఎలుగుబంట్లు మాత్రం అక్కడ భక్తులు ఉన్న ప్రజలు ఉన్న గుడి సన్నిధిలో ఉన్నంత సేపు ఏమి అనకుండా చండి దేవిని దర్శనం చేసుకొని వెళ్తాయి ,అక్కడి ప్రజలందరూ ఈ అమ్మవారు ఎంతో పవిత్రమైన దేవతగా కొలుస్తుంటారు. ఎలుగుబంట్లు కూడా ఎంతమంది భక్తులు ఉన్న వారిని ఏమి అనకుండా అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులు పెట్టె అన్న పానీయాలు స్వీకరించి వెళ్తుంటాయి.. సాధారణంగా ఎలుగుబంట్లు క్రూర జంతువులు, కానీ అక్కడ వారికి ఏ మాత్రం అపకారం చేసిన దాఖలాలు లేవు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలో ఉన్నటువంటి చండీ దేవి ఆలయంలో కి మాత్రం వచ్చే ఎలుగుబంట్లు మాత్రం సాధు జంతువు లాగా ప్రవర్తిస్తాయి..

సాధారణంగా మనం కొండగట్టు, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటాం. అక్కడ కోతులు కొండముచ్చులు మనం ఇచ్చే అరటికాయలు పళ్లు తీసుకొని తింటూ ఉంటాయి అలాగే ఈ ఎలుగుబంట్లు కూడా సాధారణ జంతువుల వలనే ప్రవర్తిస్తాయి.. దీనికి కారణం అమ్మవారి శక్తి అంటూ ఇక్కడ వారి నమ్మకం ఏది ఏమైనప్పటికీ ఎలుగుబంట్లు అమ్మవారి గుడికి రావడం అక్కడే ఉన్న పూజారి భక్తులు ఇచ్చే తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎవరినీ ఏమీ అనకుండా వెళ్లడం ఇక్కడ విశేషం..

Read Also… Viral Video: మొసలిని మట్టుబెట్టి వేటాడిన చిరుత.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే.!

Shilpa Shetty: రాజ్‌కుంద్రా పోర్న్‌ వీడియోల కేసుపై స్పందించిన శిల్పాశెట్టి.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో..