Gujarat Cabinet Minister: 24 మంది మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కొత్త కేబినెట్

గుజరాత్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

Gujarat Cabinet Minister: 24 మంది మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కొత్త కేబినెట్
Gujarat New Ministers
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 16, 2021 | 3:05 PM

Gujarat Cabinet Reshuffle:  గుజరాత్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు ఈసారి చోటు దక్కలేదు. శాసన సభ మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు జీతూ వాఘానీలు నూతన మంత్రివర్గంలో మంత్రులుగా స్థానం సంపాదించుకున్నారు.

భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మందికి చోటు కల్పించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు, సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర హోదాగల మంత్రులు. కొత్తగా నియమితులైన మంత్రులచేత గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా పాల్గొన్నారు.

భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసినవారిలో… రాజేంద్ర త్రివేది, జీతూ వఘానీ, హృషికేశ్ పటేల్, పూర్ణేష్ మోదీ, రాఘవ్‌జీ పటేల్, కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు. సీఎం భూపేంద్ర పటేల్ అధ్యక్షతన మంత్రి మండలి మొదటి కేబినెట్ సమావేశం ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గాంధీనగర్‌లో జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Read Also… Saidabad Raju Death: సైదాబాద్‌ రాజు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏం జరిగింది.? ప్రత్యక్ష సాక్ష్యులు ఏమని చెప్పారంటే..