Saidabad Raju Death: సైదాబాద్‌ రాజు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏం జరిగింది.? ప్రత్యక్ష సాక్ష్యులు ఏమని చెప్పారంటే..

Saidabad Raju Death: వారం రోజులుగా వేలాది మంది పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరిగిన సైదాబాద్‌ చిన్నారి హత్య ఘటన నిందితుడు రాజు ఎట్టకేలకు ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే...

Saidabad Raju Death: సైదాబాద్‌ రాజు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏం జరిగింది.? ప్రత్యక్ష సాక్ష్యులు ఏమని చెప్పారంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 2:57 PM

Saidabad Raju Death: వారం రోజులుగా వేలాది మంది పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరిగిన సైదాబాద్‌ చిన్నారి హత్య ఘటన నిందితుడు రాజు ఎట్టకేలకు ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు శవమై తేలడంతో అందరూ సంతోషం వ్యక్తి చేస్తున్నారు. అభం శుభం తెలియిన ఆరేళ్ల చిన్నారిని పాశవికంగా చంపిన దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగిందంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ విన్నా రాజు ఆత్మహత్యకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇంత మంది పోలీసుల, ప్రజల కళ్లుగప్పి రాజు వరంగల్‌ ఎలా వెళ్లాడు.? ఎలా ఆత్మహత్య చేసుకున్నాడన్న అంశం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా చూసిన ప్రత్యక్ష సాక్ష్యులతో టీవీ9 మాట్లాడింది. ఈ సందర్భంగా వాళ్లు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నష్‌కల్‌ రైల్వే ట్రాక్‌ పరిశీలిస్తున్న ఇద్దరు లైన్‌మెన్లకు ఓ వ్యక్తి రాజు గురించి ప్రాథమికంగా తెలిపాడు. దీంతో అక్కడి వెళ్లిన లైన్‌మెన్లు రాజు అవతారం చూసేసరికి ఎవరో పిచ్చోడులే వాడితో ఎందుకని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అతడిని చూశారన్న అనుమానంతో రాజు చెట్లలోకి వెళ్లిపోయాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న మరికొందరు వచ్చే సరికి రాజు చెట్లలో నుంచి మళ్లీ బయటకు వచ్చాడు.

దీంతో అదే సమయంలో హైదరాబాద్‌ వైపు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకువస్తోంది. ట్రైన్‌వైపు దూకడానికి ప్రయత్నిస్తున్న రాజును వద్దని అక్కడున్న వారంతా వాదించినా.. రైళు దగ్గరికి వచ్చేసరికి దూకేశాడు. దీంతో రాజు అక్కడిక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పుకొచ్చారు. అక్కడి వారికి దొరికిపోయాననే భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు అర్థమవుతోంది.

Also Read: సైదాబాద్ చిట్టి తల్లి కిడ్నాప్ నుంచి రాజు ఆత్మహత్య వరకు…వారం రోజులు ఏంజరిగింది?

రాజు డెత్ పై సీతక్క స్పందన: ప్రజా పోరాటాల వల్ల రాజు చచ్చాడు..(వీడియో): Seethakka Video.

AP Weather Report: ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. ఇవి వివరాలు