అర్థరాత్రి ‘మృతదేహాల వర్షం’.. జనాలు హడల్..!వీడియో వైరల్..: Rain of Corpses Video.
ఇండోనేషియాలో దారుణం జరిగింది. ఉన్నపళంగా వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో వందల సంఖ్యలో పక్షుల మృతదేహాలు కుప్పకూలడంతో జనాలు హడలిపోయారు. పక్షులు ఈ స్థాయిలో చనిపోవడం....
ఇండోనేషియాలో దారుణం జరిగింది. ఉన్నపళంగా వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో వందల సంఖ్యలో పక్షుల మృతదేహాలు కుప్పకూలడంతో జనాలు హడలిపోయారు. పక్షులు ఈ స్థాయిలో చనిపోవడం వెనుక వాతావరణంలో మార్పులే కారణమని స్థానిక అధికార యంత్రాంగం భావిస్తోంది. కాగా, బాలిలోని స్మశాన వాటికలో చనిపోయిన పిచ్చుకల శవాలను చూసి పర్యాటకులు, స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, కొందరు వ్యక్తులు ఈ పక్షుల మరణాలకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
బాలిలోని స్మశానవాటికలో నల్లటి వస్తువులు పరిచినట్లుగా పడి ఉన్నాయి. ఏంటా అని కొంచెం దగ్గరగా వెళ్లి చూస్తే.. అవన్నీ పక్షుల శవాలు. పిచ్చుకలన్నీ చనిపోయి పడి ఉన్నాయి. వందల సంఖ్యలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మునుపెన్నడూ ఇలాంటి సంఘటన జరుగలేదంటున్నారు స్థానికులు. రాత్రికి రాత్రే ఇన్ని పక్షులు చనిపోవడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మొదట పిచ్చుకల మృతికి వాతావరణంలో మార్పు లేదా ఆమ్ల వర్షం కారణం అయి ఉండొచ్చని భావించిన స్థానిక అధికార యంత్రాంగం, తరువాత పురుగుల మందు కారణంగానే వందలాది పిచ్చుకలు చనిపోయాయని నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇంకా విచారణ చేపడతామన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : ఓరేయ్.. నన్ను వదిలిపెట్టండ్రా.. నేను స్కూల్‌కు వెళ్లను..!వైరల్ అవుతున్న వీడియో: Little Boy Viral Video.
బీరువా నుంచి వింత శబ్దాలు..డోర్ ఓపెన్ చేసి చూస్తే షాక్..! వైరల్ వీడియో: Snake Viral Video.