Telangana News: నేడు నిర్మల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎల్లపల్లి సభ వేదికగా యుద్ధం ప్రకటిస్తారా?

Telangana News : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటూ డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది బీజేపీ. నిర్మల్ లో రాంజీ గోండు పోరాట స్మృతులను‌ గుర్తు చేసుకుంటూ..

Telangana News: నేడు నిర్మల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎల్లపల్లి సభ వేదికగా యుద్ధం ప్రకటిస్తారా?
Amit Shah
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2021 | 9:07 AM

Telangana News : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటూ డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది బీజేపీ. నిర్మల్ లో రాంజీ గోండు పోరాట స్మృతులను‌ గుర్తు చేసుకుంటూ ఎల్లపల్లిలో సభను నిర్వహించనుంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాషాయదళం ఈ సభ ద్వారా అధికార పార్టీపై యుద్ధం ప్రకటించేందుకు రెడీ అవుతోంది. టీఆర్ఎస్‌తో సై అంటే సై అనేందుకు సిద్ధమవుతోంది. ఆదివాసీ పోరాట యోధుల స్పూర్తిని రగిలిస్తూ.. ఆదివాసీ గిరిజనులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ సభను నిర్వహిస్తోంది బీజేపీ. సెప్టెంబరు 17న(ఇవాళ) మధ్యాహ్నం ఎల్లపల్లి రాంజీ గోండు సభ స్థలిలో అమిత్ షా బహిరంగ సభ సాగనుంది. లక్ష మంది కార్యకర్తలను తరలించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు బీజేపీ నాయకులు.

ఢిల్లీలో బాయి బాయి.. తెలంగాణలో దోస్తానా నై అన్నట్టుగా సాగుతున్న బీజేపీ-టీఆర్ఎస్ వ్యవహారంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కమల అధినాయకత్వం. ఇందులో భాగంగానే ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలోని‌ ఎల్లపల్లి లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. 8 ఎకరాల స్థలంలో భారీ సెట్టింగ్ లతో.. వరుణుడు ఇబ్బంది కలిగించినా సభను నిర్విగ్నంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా, ఈ సభ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిర్మల్ కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. ఇందుకోసం అధికారులు బత్తిస్ఘడ్ ప్రాంతంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు‌. కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా నిర్మల్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్మల్ ఎల్లపల్లి బహిరంగ సభా స్థలితో పాటు అమిత్ షా పర్యటించనున్న వేయి ఉరుల మర్రి, రాంజీ గోండు స్మారక స్తూపం ఏరియా కురన్న పేట, బత్తిస్ఘడ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. 535 మంది పోలీసు బలగాలతో, నలుగురు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో భద్రత కల్పించనున్నారు. ఇటు కేంద్ర భద్రత బలగాలు, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు సైతం అమిత్ షా టూర్ ను డేగ కన్నులతో పహారా కాస్తున్నారు.

ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానున్న అమిత్ షా సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన కాషాయదళం.. లక్ష మంది కార్యకర్తలకు తక్కువ కాకుండా.. సగానికిపైగా ఆదివాసీ గిరిజన అభిమానులతోనే నింపేందుకు అన్ని‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. 8 ఎకరాల స్థలంలో 25 వేల సీటింగ్‌తో పాటు 70 వేల మందికి పైగా హాజరయ్యేలా సభా స్థలిని నిర్మాణం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ కు చేరుకోనున్న అమిత్ షా.. ప్రత్యేక వాహనంలో రాంజీ గోండు స్మారక స్తూపాన్ని దర్శించుకుని‌ నివాళులర్పించనున్నారు. తిరిగి బత్తిస్ఘడ్ రోడ్డు మార్గం గుండా ఎల్లపల్లి స్థబా స్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగనుంది. కాగా, అమిత్ షా ప్రసంగం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభా వేదికగా టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటిస్తారా? రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రకటనలు చేయనున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇక అమిత్ షా టూర్ నేపథ్యంలో జిల్లా బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆదివాసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు‌. ఇందులో భాగంగానే ఆదివాసీ పోరాట వీరులు, అమరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేలా కేంద్ర ప్రభుత్వం సైతం పోకస్ పెట్టేలా ఈ సభను నిర్వహించబోతున్నారు. తొలి స్వతంత్ర సగ్రామంలో అమరులైన వీరుల త్యాగాలను ఈ సభ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిపేలా చేయడం.. నిర్మల్ లో ఆదివాసీ అమర వీరుల ఘన చరిత్రకు సాక్ష్యంగా ఉన్న వెయి ఉరుల మర్రి, రాంజీ గోండు పోరాటాన్ని తెలియజేయడం, తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వీరులను స్మరించుకోవడం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

Also read:

GST Council Meet: సామాన్యులకు ఊరటనిస్తుందా..? ఊపేస్తుందా..? పెట్రోల్ ధర రూ.34కు వస్తుందా.. ఇవాళ జీఎస్‌టీ మండలి సమావేశం

Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయంపై అనుష్క శర్మ స్పందన ఏంటో తెలుసా.. సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..?

Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయంపై అనుష్క శర్మ స్పందన ఏంటో తెలుసా.. సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?