GST Council Meet: సామాన్యులకు ఊరటనిస్తుందా..? ఊపేస్తుందా..? పెట్రోల్ ధర రూ.34కు వస్తుందా.. ఇవాళ జీఎస్‌టీ మండలి సమావేశం

సామాన్యులకు ఊరటనిస్తుందా..? ఊపేస్తుందా..? దేశ వ్యాప్తంగా ఒకటే ఉత్కంఠ.. ఎలాాంటి నిర్ణయం వస్తుంది..? ఇదేం కోర్టు తీర్పు కాదు.. అలా అని ఓ ప్రముఖుడి హెల్త్ బులిటన్ కాదు. సామాన్యుడి రథ చక్రం నడిచేందుకు ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ధరలపై ఓ నిర్ణయం.

GST Council Meet: సామాన్యులకు ఊరటనిస్తుందా..? ఊపేస్తుందా..? పెట్రోల్ ధర రూ.34కు వస్తుందా.. ఇవాళ జీఎస్‌టీ మండలి సమావేశం
Petrol Gst
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 17, 2021 | 8:56 AM

సామాన్యులకు ఊరటనిస్తుందా..? ఊపేస్తుందా..? దేశ వ్యాప్తంగా ఒకటే ఉత్కంఠ.. ఎలాాంటి నిర్ణయం వస్తుంది..? ఇదేం కోర్టు తీర్పు కాదు.. అలా అని ఓ ప్రముఖుడి హెల్త్ బులిటన్ కాదు. సామాన్యుడి రథ చక్రం నడిచేందుకు ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ధరలపై ఓ నిర్ణయం. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై ఇవాళ (శుక్రవారం) జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి సుముఖత చూపితేనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత పెట్రోల్ ధర భారీగా తగ్గబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ ధర రెండంకెల్లోకి మారబోతుదని చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఓ మంచి వార్త వింటారని ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్పిన సంగతి తెలిసిందే..

పెట్రో ఉత్పత్తులను GST పరిధిలోకి తెస్తే వినియోగదార్లకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దాదాపు 20 నెలల తర్వాత GST మండలి శుక్రవారం లఖ్‌నవూలో సమావేశం జరగబోతోంది. 2019 డిసెంబరు 18 తర్వాత ఈ సమావేశాలు వర్చువల్ మీటింగ్ జరుగుతూ వచ్చాయి. అయితే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌లను GST పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్‌టీ మండలి ప్రత్యేకంగా చర్చించనున్నారు. చర్చలు సానుకూలంగా సాగితే పెట్రోల్ ధరలు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే గత జూన్‌లో కేరళ హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చర్చించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వంటి వాటిపై పన్ను మినహాయింపులను కొనసాగించే అంశంపైనా చర్చిస్తారని సమాచారం.

సెంట్రల్ టాక్స్‌తో సహా వ్యాట్‌ రూపంలో పెట్రోల్‌, డీజిల్‌పై ప్రస్తుతం రిటైల్‌ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని GST పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్‌డ్‌ సర్‌ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత తగ్గేందుకు ఛాన్స్ ఉంది.

కేంద్రం ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 సుంకం విధిస్తోంది. ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకే వెళుతోంది. GST పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?