IPL 2021: ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్‌ రికార్డులు వీరివే.. టాప్‌ 5లో ఇద్దరు భారత బౌలర్లు కూడా..!

పరుగుల వర్షం కారణంగా ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో బౌలర్ల దృష్టి తరచుగా పోతుంది. కానీ, ఈ లీగ్ చరిత్రలో కొన్ని అద్భుత బౌలింగ్ రికార్డులు కూడా నమోదయ్యాయి. వీటిని మర్చిపోవడం అంత సులభం కాదు.

Venkata Chari

|

Updated on: Sep 17, 2021 | 9:06 AM

ఐపీఎల్ 2021 రెండో భాగం ప్రారంభం కావడానికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో మరోసారి ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్ల పోరు మొదలుకానుంది.  బాల్-బ్యాట్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతోంది. ఈ ఫార్మాట్ టీ20 క్రికెట్‌లో ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ఈ ఫార్మాట్ బౌలర్లకు కష్టంగా ఉంటుంది. అయితే చాలా సందర్భాలలో అలాంటి బౌలింగ్ కూడా కనిపించింది. ఇలాంటి బౌలింగ్ ముందుగొప్ప బ్యాట్స్‌మెన్స్ కూడా లొంగిపోయారు. ఐపీఎల్ చరిత్రలో అలాంటి 5 అత్యుత్తమ బౌలింగ్ స్పెల్స్ గురించి తెలుసుకుందాం.

1 / 6
ఐపీఎల్ చరిత్రలో కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. వీరు ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశారు. ఇందులో వెస్టిండీస్ పేసర్ అల్జర్రి జోసెఫ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ యువ ఫాస్ట్ బౌలర్ 2019లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జోసెఫ్ కేవలం 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

2 / 6
రెండవ స్థానంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ఉన్నాడు. అతను లీగ్ మొదటి సీజన్‌లో భయాందోళనలు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును 2019 లో అల్జర్రి జోసెఫ్ బద్దలు కొట్టాడు.

3 / 6
ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జాంపా ఈ సీజన్‌లో ఆడకపోవచ్చు. అతను ఈ లీగ్‌లో తన సత్తా చూపించాడు. 2016లో రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్స్ తరఫున ఆడుతున్న జాంపా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.

4 / 6
టెస్ట్ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరిచిన గొప్ప భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఐపీఎల్‌లో కూడా బాగానే రాణించాడు. 2009 లో రాజస్థాన్ రాయల్స్‌పై అత్యంత అద్భుతంగా రాణించాడు. కేవలం 3.1 ఓవర్లు బౌలింగ్‌లో 5 గురు బ్యాట్స్‌మెన్‌లను కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేర్చాడు.

5 / 6
భారత్‌ నుంచి మరొక బౌలర్ ఈ జాబితాలో టాప్ 5 లో నిలిచాడు. ఇషాంత్ శర్మ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఇలాంటి అద్భుత స్పెల్ విసిరాడు. 2011 లో కొచ్చి టస్కర్స్ కేరళపై ఇషాంత్ 3 ఓవర్లలో 12 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

6 / 6
Follow us