Kamala Harris: కమలా హారిస్‌ను చంపేందుకు 53వేల డాలర్ల ఒప్పందం.. కోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితురాలు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 17, 2021 | 12:01 PM

Threatening to Kamala Harris: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను చంపేందుకు కుట్ర పన్నినట్లు మియామీకి చెందిన నర్స్ అంగీకరించిందని ఆదేశ న్యాయశాఖ ప్రకటించింది.

Kamala Harris: కమలా హారిస్‌ను చంపేందుకు 53వేల డాలర్ల ఒప్పందం.. కోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితురాలు..
Kamala Harris

Follow us on

Threatening to Kamala Harris: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను చంపేందుకు కుట్ర పన్నినట్లు మియామీకి చెందిన నర్స్ అంగీకరించిందని ఆదేశ న్యాయశాఖ ప్రకటించింది. 39 ఏళ్ల నివియాన్ పెటిట్ ఫెల్ప్స్.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హత్యకు కుట్ర సహా మరో ఆరు నేరారోపణలను అంగీకరించినట్లు న్యాయశాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 19న ఆమెకు శిక్ష ఖరారు చేయనుండగా.. తాజాగా ఆమె చేసిన తప్పులను అంగీకరించి ప్రాయశ్చిత్తం వ్యక్తం చేసినట్లు ప్రకటించింది. ఫెల్ప్స్‌కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడనుందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. ఫ్లోరిడాలోని జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుండగా.. కమలా హారిస్‌ హత్యకు కుట్ర చేసినట్లు ఫెల్ప్స్ ఒప్పుకుంది.

కమలా హారిస్‌ను చంపేస్తానంటూ జైలులో ఉన్న తన భర్తకు ఫిబ్రవరిలో 30 సెకన్ల వీడియోను పంపినట్లు ఫెల్ప్స్ అంగీకరిచింది. అంతేకాదు.. 50 రోజుల్లో హారిస్‌ను చంపేందుకు 53 వేల డాలర్లకు ఒప్పందం కూడా చేసుకున్నట్లు ఆమె న్యాయస్థానంలో అంగీకరించింది. ఫెల్ప్స్ తన భర్తకు వీడియోలను పంపిన తరువాత.. టార్గెట్‌ షీట్‌తో తుపాకీని పట్టుకున్న ఫోటోను కూడా పంపినట్లు తెలిపారు ప్రాసిక్యూటర్లు. ఆ తరువాత ఆయుధ వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు ఆమెను అరెస్ట్ చేయకపోయి ఉంటే.. ఇప్పటికి ఏం జరిగి ఉండేదో తనకే తెలియదని విచారణ సందర్భంగా ఫెల్ప్స్ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే, తన క్లయింట్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఎవరినీ బెదిరించాలనే ఉద్దశం తన క్లయింట్‌కు లేదని ఫెల్ప్స్ తరఫు న్యాయవాది స్కాట్ బి. సౌల్ అన్నారు. ఫెల్ప్స్ తన చర్యలకు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేసిందని తెలిపారు. కాగా, తన నేరాన్ని అంగీకరించి కేసు నుంచి ఉపశమనం పొందే ఉపాయం చేస్తోందంటూ ప్రాసిక్యూటర్లు అంటున్నారు. ఏదేమైనా.. ఈ కేసులో ఆమెకు దాదాపు 5 సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశం ఉందని ఆదేశ న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. గతంలోనూ కమలా హారిస్ హత్యకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధికారిక నివాసం సమీపంలో టెక్సాస్‌కు చెందిన పాల్ ముర్రేను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద AR-15 రైఫిల్, 113 రౌండ్ల మందుగుండు సామగ్రి, ఐదు 30 రౌండ్ల మ్యాగజైన్‌లను అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో ముర్రేని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, ముర్రేకి మతిస్థిమితం సరిగా లేదని అధికారులు గుర్తించారు.

Also read:

ఒకప్పుడు మెగాస్టార్‌తో పోటాపోటీగా డాన్స్ చేసి అదరగొట్టిన ఈ అందాల హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Governor Tamilisai: విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. సంచలన ట్వీట్ చేసిన గవర్నర్‌ తమిళసై..

Ragging: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం.. ఫస్టియర్ స్టూడెంట్ దుస్తులు విప్పించి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu