ఒకప్పుడు మెగాస్టార్‌తో పోటాపోటీగా డాన్స్ చేసి అదరగొట్టిన ఈ అందాల హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే ఆమె పేరే గుర్తొచ్చేది..స్టార్ హీరోల సినిమాలకు ఆమెనే ముందు సంప్రదించేవారు.. దాదాపు టాప్ హీరోలందరితో ఆడిపాడింది

ఒకప్పుడు మెగాస్టార్‌తో పోటాపోటీగా డాన్స్ చేసి అదరగొట్టిన ఈ అందాల హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
Radha

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే ఆమె పేరే గుర్తొచ్చేది..స్టార్ హీరోల సినిమాలకు ఆమెనే ముందు సంప్రదించేవారు.. దాదాపు టాప్ హీరోలందరితో ఆడిపాడింది ఆ అందాల తార. మెగాస్టార్ చిరంజీవితో ఈ భామ చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి విజయాలను అందుకున్నాయి. మెగాస్టార్ ఆ బ్యూటీ సూపర్ హిట్ పెయిర్ అయ్యారు. అందంతోనే కాదు అభినయంతోనూ ప్రేక్షకులను కట్టేసింది ఈ హీరోయిన్. ఇంతకూ ఈ భామను గుర్తుపట్టారా..? ఆమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ రాధ. దాదాపు చాలా మంది హీరోలతో నటించారు రాధా. మెయిన్ హీరోయిన్‌గానే  కాకుండా సెకండ్ హీరోయిన్‌‌‌గానూ నటించి మెప్పించారు. ఇక రాధ డాన్స్‌లకు పెట్టింది పేరు. అప్పట్లో చిరంజీవికి పోటీగా డాన్స్ చేస్తూ అబ్బురపరిచింది ఈ సీనియర్ బ్యూటీ.Radha 1

 తాజాగా రాధా గురించి స్టార్ రైటర్ పరుచూరి బ్రదర్ గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు. రాధా గురించి ప్రస్తావిస్తూ.. చండశాసనుడు అనే సినిమాలో ఎన్టీఆర్ సరసన రాధా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. విజయశాంతి తరువాత మా సినిమాలలో ఎక్కువగా చేసింది రాధగారే. ‘కొండవీటి దొంగ’ సినిమాలో ఇద్దరూ పోటీపడి నటించారు. శ్రీదేవి – జయప్రద బాలీవుడ్‌ను ఏలేస్తున్న సమయంలో రాధగారు కూడా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాధగారిని అభిమానించే వారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ఆమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని పరుచూరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఓటీటీ ద్వారా సీనియర్ హీరోయిన్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో రాధ రీఎంట్రీ ఇస్తే ఆమె అభిమానులు సంతోషిస్తారు అని అన్నారు పరుచూరి.Radha2

మరిన్ని ఇక్కడ చదవండి : 
Tollywood Drugs Case: నేడు ఈడీ అధికారుల ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారుల..
Sonu Sood: సోనూసూద్ పై ఇన్‌కం టాక్స్ దాడులు.. ఐదు వేల రూపాయలతో ముంబాయి వచ్చిన మెస్సియా ప్రస్తుత ఆస్తులు ఎంతో తెలుసా?
Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu