Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..

Prabhas-Om Raut: ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారిన ప్రభాస్‌పై అందరి..

Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 9:40 PM

Prabhas-Om Raut: ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారిన ప్రభాస్‌పై అందరి దృష్టి పడింది. ఇప్పుడు ప్రభాస్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ఎక్కడలేని క్రేజ్‌ ఉంటుంది. పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే కన్నడకు చెందిన కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ చిత్రాన్ని, అటు బాలీవుడ్‌కు చెందిన దర్శకులు.. ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

ప్రభాస్‌ను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు ఆయన లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ షూటింగ్‌ బ్రేక్‌ టైమ్‌లో ఏం చేస్తుంటారు? కార్వాన్‌లో రెస్ట్‌ తీసుకునే సమయంలో ఏం చేస్తారు? లాంటి విశేషాలు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే షూటింగ్‌ బ్రేక్‌ సమయంలో ఏం చేస్తాడన్న విషయాన్ని ఆదిపురుష్‌ దర్శకుడు ఓంరౌత్‌ సోషల్‌ మీడియా వేదికగా చెప్పేశాడు. స్వతహాగా ప్రకృతి అంటే ప్రభాస్‌కు చాలా ఇష్టం. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏకంగా ఓ అడవినే దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే కార్వాన్‌లో ప్రకృతిని ఆస్వాదించడం కష్టం కదా.! సరైన వెలుతురు, గాలి ఉండదు. ఇందుకోసమే ప్రభాస్‌ తన కార్వాన్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. వాహనం లోపల కూడా ఫ్రెష్‌ గాలి, వెలుతురు ఉండాలనుకున్న ప్రభాస్‌ తన కార్వాన్‌ పైభాగంలో సన్‌ రూఫ్‌ను ఏర్పాటు చేయించుకున్నారు. దీంతో కార్వాన్‌లోకి గాలి, వెలుతురు పుష్కలంగా వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో పోస్ట్‌ చేసిన ఓంరౌత్‌.. ‘పని చేసే సమయంలోనూ ప్రకృతికి చేరువలో ఉండడం’ అంటూ క్యాప్షన్‌ను జోడించారు.

Prabhas Van

Also Read: Ananya Nagalla: వావ్ అనిపిస్తున్న అనన్య నాగళ్ళ ఫోటో గ్యాలరీ..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దీప్తీ.. అందరి ముందు మనసులో మాట చెప్పేసిందిగా..

Shilpa Shetty: రాజ్‌కుంద్రా పోర్న్‌ వీడియోల కేసుపై స్పందించిన శిల్పాశెట్టి.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో..