Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దీప్తీ.. అందరి ముందు మనసులో మాట చెప్పేసిందిగా..

బిగ్‌బాస్‌ తెలుగు: నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతోన్న బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ రెండో వారం విజయవంతంగా కొనసాగుతోంది. హౌజ్‌మేట్స్‌ మధ్య కోపాలు, తాపాలు, ప్రేమలు ఇలా షో రసవత్తరంగా...

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దీప్తీ.. అందరి ముందు మనసులో మాట చెప్పేసిందిగా..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 8:24 PM

బిగ్‌బాస్‌ తెలుగు: నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతోన్న బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ రెండో వారం విజయవంతంగా కొనసాగుతోంది. హౌజ్‌మేట్స్‌ మధ్య కోపాలు, తాపాలు, ప్రేమలు ఇలా షో రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్‌ల పేరుతో బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్ మధ్య తగాదాలు పెట్టిస్తున్నాడు. దీంతో కంటెస్టెంట్‌లు కూడా నువ్వా నేనా అన్న స్థాయిలోనే పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే గురువారం ప్రసారమయ్యే షోకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోతో ఎపిసోడ్‌పై హైప్‌ను పెంచారు. షణ్ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా హౌజ్‌లో వేడుకలు జరిగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే హమీదా-షణ్ముఖ్‌ల మధ్య సంథింగ్‌, సంథింగ్‌ అన్న విధంగా రవి, శ్వేత ఆటపట్టించారు. దీంతో వీరిమధ్య జరిగిన సంభాషణ ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉంటే షణ్ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్‌ దీప్తి సునయన మాట్లాడడానికి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు షో నిర్వాహకులు. దీంతో షణ్ముఖ్‌కు పుట్టిన రోజు వేడుకలు తెలిపిన దీప్తి.. ‘ఐ లవ్‌ యూ’ అని చెప్పేసింది.

దీంతో షణ్ముఖ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌ సెట్‌ బయట దీప్తి తన స్నేహితులతో కలిసి టపాసులు పేల్చి షణ్ముఖ్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించింది. దీనంతటినీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. హౌజ్‌ బయట షణ్ముఖ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పడంతో దానికి హౌజ్‌లో ఉన్న వాళ్లు అరుస్తూ సమాధానం ఇచ్చారు. దీంతో.. ‘మావోడు రిప్లై ఇచ్చాడురోయ్‌’ అంటూ దీప్తి వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: Weight Loss: రోజూ పరగడుపున వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? అసలు విషయాలను తెలుసుకొండి..

Youtube: యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది.. ఇకపై కామెంట్లను మీకు నచ్చిన భాషలో చదవొచ్చు..

Viral Video: కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకోవాల్సిందే..