- Telugu News Photo Gallery Technology photos Video Streaming Service Youtube Introducing Comments Translation Option
Youtube: యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది.. ఇకపై కామెంట్లను మీకు నచ్చిన భాషలో చదవొచ్చు..
Youtube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వీడియోల కింద వచ్చే కామెంట్లను మనకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే అవకాశం కల్పించేలా 'ట్రాన్స్‌లేట్' అనే ఫీచర్‌ను..
Updated on: Sep 16, 2021 | 7:51 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వీడియో స్ట్రీమింగ్ సేవల్లో యూట్యూబ్ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే యూట్యూబ్ అంత క్రేజ్ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే యూట్యూబ్ తాజాగా 'ట్రాన్స్‌లేట్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్లను అందించనున్నారు.

సహజంగా యూట్యూబ్‌లో వీడియోలు ప్లే అవుతోన్న సమయంలో కింద కామెంట్లు వస్తాయన్న విషయం తెలిసిందే. యూట్యూబ్ తీసుకొస్తున్న 'ట్రాన్స్‌లేట్' ఫీచర్‌తో ఈ కామెంట్లను మీకు నచ్చిన భాషల్లోకి తర్జుమా చేసుకొని చదవొచ్చు.

సుమారు వందకు పైగా భాషల్లోకి కామెంట్లను ట్రాన్స్‌లేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

లైక్, డిస్లైక్, రిప్లై ఆప్షన్స్ కింద ట్రాన్స్‌లేట్ బటన్‌ను ఇవ్వనున్నారు. దీనిని క్లిక్ చేయగానే కామెంట్లు మీకు నచ్చిన భాషలోకి మారిపోతుంది.

ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు యూట్యూబ్ ఇటీవల 'వీడియో సబ్ టైటిల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్' ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.





























