Bigg Boss 5 Telugu: అయ్యో.. బిగ్‏బాస్ ఇలా అడ్డంగా బుక్కయ్యాడేంటీ.. ఆడుకుంటున్న నెటిజన్స్..

బిగ్‏బాస్ రియాల్టీ షో బుల్లితెరపై ఉన్న ఆదరణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 19 మంది కంటెస్టెంట్స్‎ను ఎలాంటి టెక్నాలజీ

Bigg Boss 5 Telugu: అయ్యో.. బిగ్‏బాస్ ఇలా అడ్డంగా  బుక్కయ్యాడేంటీ.. ఆడుకుంటున్న నెటిజన్స్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 9:31 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో బుల్లితెరపై ఉన్న ఆదరణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 19 మంది కంటెస్టెంట్స్‎ను ఎలాంటి టెక్నాలజీ సౌకర్యాలు లేకుండా… ప్రపంచంతో సంబంధం లేకుండా… ఒక ఇంట్లో దాదాపు 100 రోజులు ఉంచడమే ఈ షో. అయితే ఇక ఇందులో బిగ్‏బాస్ పెట్టే టాస్కులను అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు.. కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్స్ పెట్టడంలోనూ బిగ్‏బాస్ దిట్ట. ఇక ఇంట్లో జరుగుతున్న సంగతులను ప్రేక్షకులను మాత్రం రివర్స్‏లో చూపిస్తాడని.. గత సీజన్స్ బట్టి తెలిసిన సంగతే. ఇక ప్రోమోస్ కట్ చేయడంలోనూ.. ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంటాడు. అయితే బిగ్ బాస్ ఇప్పటివరకు ఎలాంటి పొరబాట్లు జరగకుండా… ముందే అసలు విషయాన్ని చెప్పకుండా ప్రోమోస్ విడుదల చేస్తుంటాడు.

అయితే ఈసారి బిగ్ బాస్ తప్పులో కాలేశాడు. ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్సీ కోసం హోరాహోరి పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ పూర్తిగా విచక్షణ రహితంగా ఆడేస్తున్నారు. గత మూడు రోజులుగా గోడవలు, అరుపులతో బిగ్ బాస్ ఇంటిని రణరంగంగా మార్చేశారు. ఈ క్రమంలోనే సెకండ్ కెప్టెన్ విశ్వ అంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట్లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈసారి బిగ్‏బాస్ ముందుగానే సెకండ్ కెప్టెన్ ఎవరనేది లీక్ చేసేసాడు. ఇవాళ రిలీజైన ప్రోమోలో సెకండ్ కెప్టెన్ గురించి పూర్తిగా క్లారిటీ ఇచ్చేశాడు. ఇవాళ విడుదలైన ప్రోమోలో లోబో, ఉమాదేవి కామెడీ చేస్తుండగా.. కంటెస్టెంట్స్ పడి పడి నవ్వారు. అందులో విశ్వ ఎడమ చేతికి కెప్టెన్ బ్యాండ్ ఉంది. అయితే ఈ విషయాన్ని నెటిజన్స్ గుర్తించారు. ఇంకేముందీ తమదైన శైలీలో బిగ్‏బాస్‏ను ఆడుకుంటాన్నారు. ఇదేందయ్యా.. నువ్వే లీక్ చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశ్వ ఫోటోను రౌండ్ చేసి.. మీమ్స్ తో నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు.

ట్వీట్స్..

Also Read: ఆఫ్గాన్ మహిళలకు తాలిబన్ల ఆదేశం.. సోషల్ మీడియా ద్వారా తమ తిరుగుబాటును ఎలా వ్యక్తం చేశారో తెలుసా..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ