Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మిడ్ నైట్ రోమన్స్.. ఆ కంటెస్టెంట్‌కు టైట్ హగ్ ఇచ్చిన లహరి..
బిగ్ బాస్ సీజన్ 5 ఊహించినట్టుగానే రసావత్రరంగా సాగుతుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న 18మంది కంటెస్టెంట్స్ ఎక్కువ రోజులు ఉండటానికి తెగ కష్టపడుతున్నారు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఊహించినట్టుగానే రసావత్రరంగా సాగుతుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న 18మంది కంటెస్టెంట్స్ ఎక్కువ రోజులు ఉండటానికి తెగ కష్టపడుతున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను చాలా జాగ్రత్తగా ఆడుతూ.. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎప్పటిలానే హౌస్‌లో గొడవలు, ఏడుపులు, అల్లర్లు అన్ని యదా విధిగా సాగుతున్నాయి. అలాగే లవ్ స్టోరీలు కూడా అదే విధంగా నడుస్తున్నాయి. ఇప్పటికే హమీదా- శ్రీరామ్ కు మధ్యలో ఎదో ఉందని అంతా అనుకుంటుండగా.. తాజాగా మరో జంట ఇప్పుడు హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ముద్దుగుమ్మ లహరి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి మాట్లాడుతూ.. తన స్టైల్‌లో గేమ్ ఆడుతూ కనిపించింది.అలాగే మానస్ కూడా తన గేమ్ తాను ఆడుతూ.. ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎదో జరుగుతుందని అనిపిస్తుంది.
రాత్రి సమయంలో మానస్ గిన్నెలు కడుగుతుండగా.. అతని దగ్గరకు వచ్చింది లహరి. ఆమె బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉండటంతో నీకు బ్లాక్ అంటే ఇష్టమా అని అడిగాడు.. దానికి లహరి అవును నాకు బ్లాక్ అంటే ఇష్టం.. ఆ తర్వాత వైట్, బ్లూ అంటే ఇష్టం అని చెప్పింది. దాంతో బ్లూ నా ఫెవరెట్ అన్నాడు మానస్. లహరి మానస్ ఒంటిరిగా మాట్లాడుకుంటుండగా.. శ్రీరామ్, సిరి, ప్రియ వీళ్లని గమనిస్తూ ఉన్నారు. శ్రీరామ్ చూడటాన్ని గమనించిన మానస్.. హో లుక్‌లు ఇస్తున్నావా? అని అని లహరికి వినిపించేట్టుగా అన్నాడు. ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉన్నా నేను వస్తాను.. ఎందుకంటే ఈ టైమ్‌లో ఒక్కరే పని చేయాలంటే చిరాకు కదా అంది లహరి. ఇంతలో శ్రీరామ్ వీళ్ల దగ్గరకు రావడంతో మానస్ వెంటనే ‘ఏంటి లహరి పడుకుంటున్నావా..? ఓకే గుడ్ నైట్ అని ఓ హగ్ ఇచ్చాడు. దాంతో శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నా బెడ్ వరకూ రా అని మానస్‌ని పిలిచింది లహరి. మానస్ ఆమె వెనుకే వెళ్లడంతో మైక్ తీసేసిన లహరి.. మానస్‌ని గట్టిగా కౌగిలించుకుంది. మాన స్ కూడా లహరి ఓ టైట్ హగ్ ఇచ్చాడు. లహరి ఇలా మానస్‌ను బెడ్ దగ్గరకు పిలిపించుకుని మరీ హగ్ ఇవ్వడాన్ని చూసి మిగిలిన వలందరూ.. షాక్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :