Governor Tamilisai: విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. సంచలన ట్వీట్ చేసిన గవర్నర్ తమిళసై..
సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినమా? విలీనమా? విద్రోహమా? ఈ మూడింటిపై ఎవరి వాదన వారిదే. బీజేపీ మాత్రం ఇది విమోచనమే అంటోంది. ఆ వాదనను మిగిలిన పక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్...
సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినమా? విలీనమా? విద్రోహమా? ఈ మూడింటిపై ఎవరి వాదన వారిదే. బీజేపీ మాత్రం ఇది విమోచనమే అంటోంది. ఆ వాదనను మిగిలిన పక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళసై చేసిన ట్వీట్ రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు తమిళసై. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని ట్వీట్‌లో పేర్కొన్నారు గవర్నర్.
మరోవైపు TRS మాత్రం సెప్టెంబర్ 17ను విలీన దినమంటోంది. పార్టీ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు సెక్రటరీ జనరల్ కేశవరావు. వివాదాలకు ముగింపు పలికి విలీన దినోత్సవం చేసుకోవాలని పిలుపునిచ్చారాయన.
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.#Vimochanadinam
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 17, 2021
ఇవి కూడ చదవండి: PM Narendra Modi Birthday: ఎన్‌సిసి నుంచి ప్రధాని దాకా నరేంద్ర మోడీ.. అరుదైన ప్రత్యేకమైన ఫోటోలు..