Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR vs Revanth vs Shashi Tharoor: సారీ చెప్పాడు.. ఓకే.. కలిసి పని చేద్దాం.. కాంగ్రెస్‌ టు కాంగ్రెస్‌ వయా టీఆర్‌ఎస్‌.. ట్వీట్‌వార్‌లోకి పెద్దలు..

టీకాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సారీ చెప్పారు.. ఎవరికి చెప్పారూ అంటే ఆ పార్టీ ఎంపీ, జాతీయ నేత శశిథరూర్‌కి. అసలు సారీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందీ అంటే అడ్డగాడిద అని కామెంట్ చేసినందుకు.

KTR vs Revanth vs Shashi Tharoor: సారీ చెప్పాడు.. ఓకే.. కలిసి పని చేద్దాం.. కాంగ్రెస్‌ టు కాంగ్రెస్‌ వయా టీఆర్‌ఎస్‌.. ట్వీట్‌వార్‌లోకి పెద్దలు..
Row Ends After Shashi Tharo
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 17, 2021 | 12:38 PM

టీకాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సారీ చెప్పారు.. ఎవరికి చెప్పారూ అంటే ఆ పార్టీ ఎంపీ, జాతీయ నేత శశిథరూర్‌కి. అసలు సారీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందీ అంటే అడ్డగాడిద అని కామెంట్ చేసినందుకు. ఆ కామెంట్ ఎందుకు చేశారూ అంటే కేటీఆర్‌ థ్యాంక్యూ చెప్పినందుకు. కేటీఆర్ థ్యాంక్యు ఎందుకు చెప్పారంటే శశిథరూర్‌ మెచ్చుకున్నందుకు. మ్యాటర్‌లో కన్‌ఫ్యూజన్‌ ఏమీ వద్దు.. కాంగ్రెస్‌ Vs కాంగ్రెస్‌ వయా టీఆర్‌ఎస్‌గా నడుస్తున్న ట్వీట్‌ వార్‌లో అసలు ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోంది.. చూసేద్దాం.. టీకాంగ్రెస్‌లో ట్విట్టర్ వార్ నడుస్తోంది. దీనికి మూలం మొన్నీ మధ్య జరిగిన ఓ ఐటీ రివ్యూ. ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిథరూర్‌ ఇటీవల తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను అభినందించారు.

కాంగ్రెస్ నేత, నేషనల్‌ లెవల్ సీనియర్ లీడర్ శశిథరూర్‌ ఈ కామెంట్‌ చేయడంతో TRS ప్రభుత్వంలోనూ ఓ జోష్ వచ్చింది. దానికి తెలంగాణ IT శాఖ మంత్రి KTR తిరిగి.. ఓ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్ నేత ఇలా అనడం ఆనందంగా ఉందన్న భావన వ్యక్తం చేశారు. ఓ కాంగ్రెస్ నేత పొగడ్డం, TRS నేత దానికి థ్యాంక్స్ చెప్పడం.. ఈ రెండూ తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపాయి. రేవంత్ ఇంకాస్త నోరు పెద్దది చేసుకుని శశిథరూర్‌ ఓ అడ్డగాడిద అంటూ కామెంట్ చేశారు. ఆఫ్‌ ద రికార్డ్ రేవంత్ చేసిన ఈ కామెంట్స్‌ను ఆడియో రూపంలో KTR ట్వీట్ చేశారు. ఆ ఆడియోలో ఏముందో ఆ ట్వీట్ చూసిన అందరికి తెలిసిందే.

ఈ ఆడియో శశిథరూర్‌ కంటపడ్డంతో.. ఆయనలో సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి తనను అడ్డగాడిద అన్నారన్నట్టు ప్రతిస్పందించారు.

ఈ ఆడియో బయటడడం ఓ రకంగా టీకాంగ్రెస్‌కు, రేవంత్‌కు కాస్త మింగుడుపడలేని విషయమే. అయినా కూడా శశిథరూర్‌ టాపిక్‌ను తెరపైకి తెచ్చి కేటీఆర్‌ లోకల్‌గా ఉండే సమస్యలను దారితప్పిస్తున్నారని మరో ట్వీట్‌ చేశారు. దానికి స్పందించిన కేటీఆర్‌.. ఉన్నది ఉన్నట్లు చెబితే ఇంతేనా. అయినా పార్లమెంట్‌లో కలిసి ఉండే ఓ సహచర ఎంపీని అడ్డగాడిదా అంటూ మాట్లాడొచ్చా అని ఏకంగా రాహుల్‌గాంధీని అటాచ్ చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.

ఇది కాస్తా.. కాంగ్రెస్‌, టు కాంగ్రెస్‌ వయా టీఆర్‌ఎస్‌గా మారిన ఈ ట్వీట్‌వార్‌లో కాంగ్రెస్ పెద్దలు ఇన్‌వాల్వ్‌ అవ్వక తప్పనిపరిస్థితి. ఆడియో విన్న కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్‌ తివారీ కూడా రేవంత్‌ అలా మాట్లాడకూడదంటూ చురక అంటించారు.

ట్వీట్‌లు చాంతాడంత అవుతున్నాయి.. వార్ పెరిగిపోతోంది. ఇక దీనికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఏకంగా శశిథరూర్‌కి కాల్ చేశారు. నోరుజారానంటూ సారీ చెప్పుకొచ్చారు. ఈ సారీకి థరూర్‌ కూడా శాంతించినట్లే ఉన్నారు. రేవంత్ కాల్ చేశారు. నోరుజారాను అని వివరణ ఇచ్చారు. ఇప్పటికి కూల్. ఇక పనిచేద్దాంటూ కాంగ్రెస్‌లో అడ్డగాడిద పేరుతో జరుగుతున్న వివాదానికి ఫుల్‌ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి: Governor Tamilisai: విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. సంచలన ట్వీట్ చేసిన గవర్నర్‌ తమిళసై..