AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rape Victim Suicide: బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రేపిస్ట్.. విషయం తెలిసి బాధితురాలు ఏం చేసిందంటే..?

Rape Victim Suicide: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి జైలు నుంచి విడుదల కావడంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది.

Rape Victim Suicide: బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రేపిస్ట్.. విషయం తెలిసి బాధితురాలు ఏం చేసిందంటే..?
Woman Suicide
Shiva Prajapati
|

Updated on: Sep 17, 2021 | 1:00 PM

Share

Rape Victim Suicide: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి జైలు నుంచి విడుదల కావడంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకెళితే.. జరీపట్కా ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు అతనికి జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే, తాజాగా నిందితుడు బెయిల్‌ తీసుకుని జైలు నుంచి విడుదల అయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక అప్పటి నుంచి తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తల్లి, తండ్రి, సోదరిడితో కలిసి జీవిస్తున్న బాలిక.. నిందితుడు విడుదల అవ్వటాన్ని జీర్ణించుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే బాలికను కిందకు దించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు విడుదల అవటంతో.. ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైందని, ఆ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని చెప్పారు.

Also read:

Kamala Harris: కమలా హారిస్‌ను చంపేందుకు 53వేల డాలర్ల ఒప్పందం.. కోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితురాలు..

Crime News: పెళ్లి పేరుతో వంచన.. ఫోటోలు చూసి కనెక్ట్ అయ్యోరో అంతే సంగతులు.. షాకింగ్ క్రైమ్ స్టోరీ..

Telangana Crime: గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చారు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యారు.. అసలు మ్యాటర్ ఏంటంటే..