Cooking Oil: మీరు వాడే వంట నూనె మంచిదేనా.. మీ అనారోగ్యం వెనుక ఫేక్ ఆయిల్ ఉందంటే నమ్ముతారా.. అవును.. ఇది నిజం
మీరు వాడే వంట నూనె మంచిదేనా? కలర్‌ఫుల్‌గా మెరిసిపోయే ఆయిల్‌లో డేంజర్ కెమికల్స్ ఉన్నాయని మీకు తెలుసా? చాలా కుటుంబాల్లో చాలామంది అనారోగ్యం వెనుక ఫేక్ ఆయిల్ ఉందంటే నమ్ముతారా? అవును..
మీరు వాడే వంట నూనె మంచిదేనా? కలర్‌ఫుల్‌గా మెరిసిపోయే ఆయిల్‌లో డేంజర్ కెమికల్స్ ఉన్నాయని మీకు తెలుసా? చాలా కుటుంబాల్లో చాలామంది అనారోగ్యం వెనుక ఫేక్ ఆయిల్ ఉందంటే నమ్ముతారా? అవును.. ఇది నిజం. మార్కెట్‌లో విచ్చలవిడిగా విడివిడిగా అమ్ముతున్న ఆయిల్ విక్రయాల్లో అంతా కల్తీనే అని తేల్చింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సేకరించిన శాంపిళ్లలో ప్రమాదకర స్థాయిలో ఆరోగ్యాన్ని హరించే కెమికల్స్ ఉన్నాయని సూచించింది. అసలుకు ఏ మాత్రం తీసిపోవు. నకిలీ ఏదో అసలు ఏదో ఎవ్వరూ గుర్తు పట్టలేరు. బ్రాండెడ్ పేర్లతో పాటు సొంత బ్రాండ్ల తయారీలోనూ తమదైన మార్క్‌ను చూపుతున్నారు కొందరు అక్రమార్కులు. కలర్‌ఫుల్ ప్యాకింగ్‌తో పాటు విడిగా ఆయిల్ అంటగడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
వంట నూనెల్లో విషపూరిత రసాయనాలు ఉన్నాయి. లూజ్ ఆయిల్ ఎక్కువ కల్తీ అవుతోంది. ఈ నూనె వాడకంతో క్యాన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అథారిటీ సర్వేలో వెల్లడైంది. గతేడాది ఆగస్ట్‌లో వేర్వేరు రాష్ట్రాల్లో వంట నూనెల శాంపిల్స్ సేకరించి, పరీక్షించింది FSSAI. అందుకు సంబంధించిన రిపోర్ట్‌ను ఈనెల 4న రిలీజ్ చేసింది. నివేదికలో నివ్వెరపోయే నిజాలు వెల్లడించింది.
వేర్వేరు ప్రాంతాల్లో 4,461 శాంపిళ్లను సేకరించింది FSSAI. వీటిలో 118 శాంపిల్స్ అసలు సేఫ్ కాదని మరో 453 శాంపిళ్లలో క్వాలిటీ లేనట్టు గుర్తించింది. 794 శాంపిళ్లు అవి ఎక్కడ తయారు చేశారో కూడా తెలియదని.. వాటన్నింటిని మిస్ బ్రాండ్ కింద నమోదు చేసింది FSSAI. యాసిడ్ వాల్యూ, ర్యాన్సిడిటీ, మాయిశ్చర్ కంటెంట్ చాలా శాంపిల్స్ ఫెయిల్అయినట్లు గుర్తించింది.
అసలు ఏయే నూనెల్ని కల్తీ చేస్తున్నారో చూద్దాం.. ఎక్కువగా పల్లి నూనె కల్తీ అవుతున్నట్టు FSSAI గుర్తించింది. ఆ తర్వాత సోయాబీన్, రైస్ బ్రాన్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె కల్తీ అవుతున్నట్టు తేల్చింది. వంట నూనెల్లో A, D విటమిన్లు ఉండాల్సిన స్థాయిలో లేవని పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 రకాల ఎడిబుల్ ఆయిల్స్‌పై సర్వే చేపట్టి ఈ నిజాలను బయటపెట్టింది FSSAI. రూల్స్ ప్రకారం లూజ్ ఆయిల్ ఎవరూ అమ్మకూడదు. కానీ యథేచ్ఛగా ఇలాంటి అమ్మకాలు జరుగుతున్నట్టు తన రిపోర్ట్‌లో పేర్కొంది.
కల్తీ ఆయిల్ వినియోగంతో వచ్చే అనారోగ్య సమస్యల్ని ఓ సారి చూద్దాం…. సేఫ్టీ, క్వాలిటీ లేని వంట నూనెల వినియోగంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటోంది FSSAI. అంతేకాదు జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, లంగ్స్ దెబ్బతినడం, హార్ట్ ఎటాక్‌తో పాటు పక్షవాతం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటోంది. వంటనూనెల్ని లూజ్‌గా కాకుండా ప్యాకెట్‌లను తీసుకోవాలని సజెస్ట్ చేస్తోంది FSSAI. ఎడిబుల్ ఆయిల్స్ సేఫ్టీపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది FSSAI.
వంట నూనెల్లో కల్తీని గుర్తించిన FSSAI.. వాటిని ఎలా గుర్తించాలో కూడా చెబుతోంది. అదెలాగో ఓసారి చూద్దాం. రెండు పాత్రల్లో విడివిడిగా ఆయిల్ తీసుకోవాలి. వాటిలో పసుపు రంగులో ఉన్న వెన్నను వేయాలి. కొద్దిసేపటి తర్వాత రంగు మారితే అది కల్తీ ఆయిల్‌గా గుర్తించాలి. లేదంటే స్వచ్ఛమైన ఆయిల్ కింద లెక్క. ఒకవేళ అది ఎరుపు రంగులోకి మారితే అందులో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ కలిసిందని అర్ధం. అది పాస్పరస్ కలిగిన ఫెస్టిసైడ్ అని దాని వినియోగం పక్షవాతానికి దారితీస్తుందని చెబుతోంది FSSAI.
తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరో10 జిల్లాల్లో కల్తీ నూనెలు తయారి జరుగుతోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్ లోను ఇదే దందా కొనసాగుతోంది. మిల్లుల్లో ఇతర నూనెల మిక్సింగ్‌పై రాష్ట్రాలు దృష్టి పెట్టాలంటోంది FSSAI.తనిఖీలు రెగ్యులర్‌గా చేపట్టాలని.. హోటల్స్, వంటనూనెల తయారీ, విక్రయ కేంద్రాల్లో శాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు సేకరించి పరీక్షలు చేపట్టాలని సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. సంచలన ట్వీట్ చేసిన గవర్నర్ తమిళసై..