పండగ పూట ఆవ నూనె ధరలు పరిగే అవకాశం..! రికార్డ్‌ రేట్లకు కొనుగోలు చేస్తున్న కంపెనీలు

Oil Prices: దేశంలో వంట నూనెల దిగుమతి సుంకాలు పెరిగాయి. దీని ప్రభావం ఢిల్లీ ఆయిల్ సీడ్ మార్కెట్‌లో కనిపించింది.

పండగ పూట ఆవ నూనె ధరలు పరిగే అవకాశం..! రికార్డ్‌ రేట్లకు కొనుగోలు చేస్తున్న కంపెనీలు
Mustard Oil
Follow us
uppula Raju

|

Updated on: Sep 17, 2021 | 8:59 PM

Oil Prices: దేశంలో వంట నూనెల దిగుమతి సుంకాలు పెరిగాయి. దీని ప్రభావం ఢిల్లీ ఆయిల్ సీడ్ మార్కెట్‌లో కనిపించింది. శుక్రవారం సోయాబీన్, ముడి పామాయిల్, పామోలిన్ ఆయిల్ ధరలు తగ్గాయి. మరోవైపు డిమాండ్ పెరగడం వల్ల ఆవ నూనె, వేరుశెనగ నూనె, నూనె గింజలు , పత్తి గింజల ధరలు మెరుగుపడ్డాయి. దిగుమతి సుంకం విలువను లెక్కించడంలో ప్రభుత్వం రూపాయి మారకం రేటును డాలర్‌కు రూ.74.40కి తగ్గించింది. ఈ నిర్ణయంతో ముడి పామాయిల్ దిగుమతి సుంకం విలువ టన్నుకు రూ.20,807కి పెరిగింది.

దీంతో టన్నుకు రూ.126 పెరిగినట్లయింది. సోయాబీన్ డీగమ్ ఆయిల్ దిగుమతి సుంకం ధర టన్ను రూ. 24,453, పామోలిన్ నూనె టన్ను రూ. 30,933 కి పెరిగింది. సెప్టెంబర్ 15 న ప్రభుత్వం ఈ నూనెల దిగుమతి సుంకం విలువను పెంచింది. ఇప్పుడు మారకపు రేటు పెరిగింది. దీని కారణంగా సోయాబీన్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ ధరలు పతనంతో ముగిశాయి. మలేషియా ఎక్స్ఛేంజ్ 1.7 శాతం నష్టపోగా, చికాగో ఎక్స్ఛేంజ్ గురువారం రాత్రి రెండు శాతం పతనమైన తర్వాత ప్రస్తుతం 1.5 శాతం పతనమైంది.

ఆవనూనె ధరలో పెరుగుదల ఆవ గింజలు తక్కువ లభ్యత కారణంగా పెద్ద బ్రాండ్ కంపెనీలు అధిక ధరకు విక్రయిస్తున్నాయి. రాజస్థాన్‌లోని కోటా నుంచి రూ.18,300 క్వింటాళ్ల (GST మినహాయించి) చొప్పున కొనుగోలు చేశారు. పండగ డిమాండ్ కారణంగా చమురు ధరలు మెరుగుపడ్డాయి. ఫ్యూచర్స్ ట్రేడ్‌లో రూ.120 క్వింటాళ్లు నష్టపోయినప్పటికీ స్పాట్ మార్కెట్‌లో ఆవ గింజల ధరలు పెరిగాయి. డిమాండ్ పెరుగుదల కారణంగా వేరుశెనగ నూనె, నూనె గింజలు, పత్తి గింజల ధరలు కూడా మెరుగుపడ్డాయి.

Zodiac Signs: వీరు త్వరగా ఎవరితోనూ కలవలేరు.. వీరి దగ్గర రహస్యాలు ఎప్పటికీ బయటపడవు.. వారి రాశి చక్రమే దానికి కారణం!

పెళైన యువతి ఫొటో మార్ఫింగ్‌ చేసిన విద్యార్థి.. వాట్సాప్‌లో కుటుంబసభ్యులకు షేర్.. ఆతర్వాత ఏంజరిగిందంటే..?

BCCI: జూనియర్ సెలెక్షన్ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. చైర్మన్‌గా 27 సెంచరీలు చేసిన ఆటగాడు..