పెళైన యువతి ఫొటో మార్ఫింగ్‌ చేసిన విద్యార్థి.. వాట్సాప్‌లో కుటుంబసభ్యులకు షేర్.. ఆతర్వాత ఏంజరిగిందంటే..?

Cyber Crime: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మోసాలు పెరిగాయి. కొందరు కేటుగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేర్లు మార్చుకుంటూ.. యువతులను టార్గెట్ చేస్తున్నారు.

పెళైన యువతి ఫొటో మార్ఫింగ్‌ చేసిన విద్యార్థి.. వాట్సాప్‌లో కుటుంబసభ్యులకు షేర్.. ఆతర్వాత ఏంజరిగిందంటే..?
Online Cheating
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 17, 2021 | 8:43 PM

సోషల్ మీడియా ద్వారా అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది. ఇంటర్నెట్ దూరంగా ఉన్నవారిని దగ్గర చేస్తుంది. వ్యక్తుల మధ్య సమాచారంతో పాటు తమకు నచ్చిన ఫోటోలను సైతం షేర్ చేస్తుంటారు. ఇలా వందలాదిగా ఫొటోలను చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ప్రొఫైల్‌ పిక్స్‌కు లాక్‌ కూడా పెట్టుకోరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అంత మంచి పని కాదని పోలీసులు సూచిస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మరుతోంది. తాజాగా ఇలాంటి ఘటననే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. యువతుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు బీటెక్ విద్యార్థులు. యువతుల ఫిర్యాదుతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మోసాలు పెరిగాయి. కొందరు కేటుగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేర్లు మార్చుకుంటూ.. యువతులను టార్గెట్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తికి చెందిన విద్యార్థి అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్‌ సెకండియర్ చదువుతున్నాడు. సోషల్‌ మీడియాలో యువతుల మొబైల్‌ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్‌ లాగుతూ.. ప్రేమిస్తున్నట్లు నమ్మబలికుతాడు. అన్వేష్‌ అనే వ్యక్తిగా ఒకరితో, భరత్‌ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్‌ అనే పేరుతో ఇంకో అమ్మాయితో ఇలా పేర్లు మార్చుతూ.. మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు ముగ్గులోకి లాగుతాడు. ఈ క్రమంలో వివాహమైన యువతి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా సేకరించాడు. వాటిని మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో ఆమె ఫోటోలను వారి కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

బాధితులురాలు కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడిని కర్నూలు కలెక్టరేట్‌ దగ్గర గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్‌ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి రిక్వెస్ట్‌లు వస్తే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చిన ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు.

Read Also…  Krishna District Murder cases: చిన్న క్లూతో వీడిన కేసుల చిక్కుముడి.. రెండు మర్డర్ కేసులను ఛేదించిన పోలీస్ కానిస్టేబుల్స్