Krishna District Murder cases: చిన్న క్లూతో వీడిన కేసుల చిక్కుముడి.. రెండు మర్డర్ కేసులను ఛేదించిన పోలీస్ కానిస్టేబుల్స్

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 17, 2021 | 8:06 PM

Police chased murder cases: ఒకే ఒక్క క్లూ... ఎంత పెద్ద నేరస్థుడినైనా పట్టిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఇదే బేసిన్ లైన్. చిన్న క్లూను పట్టుకుని పెద్ద పెద్ద కేసులనే ఛేదించారు కృష్ణాజిల్లా కానిస్టేబుల్స్.

Krishna District Murder cases: చిన్న క్లూతో వీడిన కేసుల చిక్కుముడి.. రెండు మర్డర్ కేసులను ఛేదించిన పోలీస్ కానిస్టేబుల్స్
Krishna District Police Constables

Follow us on

Krishna District Murder cases: ఒకే ఒక్క క్లూ… ఎంత పెద్ద నేరస్థుడినైనా పట్టిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఇదే బేసిన్ లైన్. అయితే, ఆ చిన్న క్లూను పట్టుకోవడమే కష్టం. అలా, చిన్న క్లూను పట్టుకుని పెద్ద పెద్ద కేసులనే ఛేదించారు కృష్ణాజిల్లా కానిస్టేబుల్స్. అటు డిపార్ట్‌మెంట్ నుంచి.. ఇటు ప్రజల నుంచి వీడేరా పోలీస్ అంటూ అభినందనలు అందుకుంటున్నారు.

నేరస్థుడు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక క్లూ కచ్చితంగా వదిలేసే వెళ్తాడు. అదేంటో కనిపెడితే కేసు చిక్కుముడి వీడిపోయినట్లే. ఇలాంటి డైలాగ్స్ ఎక్కువగా సినిమాల్లో వింటూ ఉంటాం. నిజమే, నేరస్థుడు ఎంత తెలివైన వాడైనా ఏదోఒక తప్పు చేస్తాడు. క్లూ వదిలే వెళ్తాడు. దాన్ని కనిపెడితే ఎంత పెద్ద నేరస్థుడైనా దొరికిపోతాడు. కృష్ణాజిల్లా పోలీసులు అదే చేశారు. టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈరోజుల్లో ఒకే ఒక్క చిన్న క్లూతో రెండు పెద్ద కేసులను ఛేదించి శెభాష్ అనిపించుకున్నారు.

మచిలీపట్నం మండలం రుద్రవరంలో ఆగస్ట్ 21న డ్రైనేజీలో మహిళ మృతదేహం బయటపడింది. గోనె సంచిలో కట్టిపడేశారు. డెడ్‌బాడీ అప్పటికే డీకంపౌజ్ అయ్యింది. టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ కేసులను ట్రాక్ చేసినా ఎక్కడా మ్యాచ్ కాలేదు. ఇక్కడే ఓ కానిస్టేబుల్ బుర్రకు పని చెప్పాడు. దృశ్యం సినిమా తరహాలో ఒక్కో ట్విస్ట్‌ను విప్పుకుంటూ కేసును ఛేదించాడు. ఇంటింటికీ తిరిగి ఓ కుటుంబం మచిలీపట్నం నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించాడు. ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ గుంటూరు వెళ్లిన కానిస్టేబుల్ రామకృష్ణ… మృతురాలి భర్తే హంతకుడిగా గుర్తించి పట్టుకున్నాడు. మరో కానిస్టేబుల్ గోపి కూడా ఇదే తరహాలో మర్డర్ కేసును ఛేదించాడు. కేసులను ఛేదించడానికి అవసరమైన ఓ ఒక్క చిన్న క్లూ కోసం రోజులతరబడి కష్టపడ్డారు. అందుకే, వీళ్లిద్దరినీ ప్రత్యేకంగా అభినందించారు కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.

ఎస్పీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందంటున్నాడు కానిస్టేబుల్ గోపి. తమ కష్టానికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తంచేస్తున్నాడు రామకృష్ణ. ఆధారాలు దొరకలేదని చేతులెత్తేస్తే కథ మరోలా ఉండేది. కానీ, కానిస్టేబుల్స్ రామకృష్ణ, గోపి పెట్టిన ఎఫెర్ట్స్‌తో నిందితుల ఆట కట్టయ్యింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఛాలెంజింగ్‌గా తీసుకుని కేసులను ఛేదించిన కానిస్టేబుల్స్ రామకృష్ణ, గోపికి ప్రశంసలతోపాటు రికార్డు కూడా దక్కింది.

Read Also…  Drugs Case: కెల్విన్‌తో ఉన్న లింక్‌లేంటి? జీషాన్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ పేరెందుకుంది? తనీష్‌కు 8 గంటల పాటు ప్రశ్నలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu