Drugs Case: కెల్విన్‌తో ఉన్న లింక్‌లేంటి? జీషాన్ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ పేరెందుకుంది? తనీష్‌కు 8 గంటల పాటు ప్రశ్నలు
కెల్విన్‌తో ఉన్న లింక్‌లు ఏంటి? జీషాన్‌తో సంబంధాలేంటి? జీషాన్ కాంటాక్ట్ లిస్ట్‌లో తనీష్ పేరు ఎందుకుంది? బ్యాంక్ ట్రాన్సక్షన్స్
Tanish – Tollywood Drugs Case: కెల్విన్‌తో ఉన్న లింక్‌లు ఏంటి? జీషాన్‌తో సంబంధాలేంటి? జీషాన్ కాంటాక్ట్ లిస్ట్‌లో తనీష్ పేరు ఎందుకుంది? బ్యాంక్ ట్రాన్సక్షన్స్ ఏ విధంగా సాగాయి? ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? ఇలా 8 గంటల పాటు సినీ నటుడు తనీష్‌ను విచారించారు ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మనీలాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘనపై ఆరా తీశారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ డైరీలో ఇవాళ తనీష్ టైమ్ వచ్చింది. ఈక్రమంలో ఇవాళ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు నటుడు తనీష్. డ్రగ్స్ కేసుకు సంబంధించి అతనిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. ముఖ్యంగా కెల్విన్, జీషాన్‌తో సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.
ఇప్పటివరకు పూరీ మొదలు ముమైత్ ఖాన్ వరకు సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. కెల్విన్‌తో లింకులు, ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీ, బ్యాంక్ ట్రాన్సక్షన్స్ పైనే ఈడీ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ క్లబ్ లాంజ్‌లో జరిగిన పార్టీలో తనీష్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో దీని గురించి ఈడీ అధికారులు కూపీలాగారు.
Read also: NIA: షరియా లక్ష్యం.. ఆన్‌లైన్ ద్వారా భావజాల వ్యాప్తి. ఇస్లామిక్ స్టేట్ వ్యాప్తిపై NIA కీలక ప్రకటన