AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: జూనియర్ సెలెక్షన్ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. చైర్మన్‌గా 27 సెంచరీలు చేసిన ఆటగాడు..

BCCI: భారత క్రికెట్‌లో మార్పులు మొదలయ్యాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ 20 ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకోవాలని

BCCI: జూనియర్ సెలెక్షన్ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. చైర్మన్‌గా 27 సెంచరీలు చేసిన ఆటగాడు..
Bcci
uppula Raju
|

Updated on: Sep 17, 2021 | 8:47 PM

Share

BCCI: భారత క్రికెట్‌లో మార్పులు మొదలయ్యాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ 20 ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. టీ 20 ప్రపంచకప్ తర్వాత అతను ఈ ఫార్మాట్‌లో నాయకత్వ బాధ్యతను వదులుకుంటాడు. ఈ నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త ఎంపిక కమిటీని ప్రకటించింది. ఇప్పటికే BCCI సీనియర్ సెలక్షన్ కమిటీ చేతన్ శర్మ అధ్యక్షతన ఉంది. తాజాగా జూనియర్ సెలక్షన్ కమిటీని ప్రకటించింది. తమిళనాడు మాజీ రంజీ క్రికెటర్ శరత్ శ్రీధరన్‌ను కమిటీ చైర్మన్ గా నియమించింది.

బీసీసీఐ ప్రకారం.. బోర్డు ఐదు మండలాల నుంచి ఎన్నికైన సభ్యుల గురించి సమాచారాన్ని అందించింది. ఇందులో సౌత్ జోన్ నుంచి శరత్ శ్రీధరన్ ఉన్నారు. పాథిక్ పటేల్ వెస్ట్ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. అదే సమయంలో హర్విందర్ సింగ్ సోధి సెంట్రల్ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈస్ట్ జోన్ నుంచి బెంగాల్ మాజీ ఫాస్ట్ బౌలర్ రణదేబ్ బోస్ ఎంపికయ్యారు. కొత్త సెలెక్షన్ కమిటీ బాధ్యతలు స్వీకరించిన శరత్ శ్రీధరన్ తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల తన కెరీర్‌లో శరత్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.

తమిళనాడు తరపున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందారు. అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అతని సుదీర్ఘ కెరీర్‌లో అతను 51 సగటుతో 8700 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు అతను 100 కంటే ఎక్కువ లిస్ట్-ఎ మ్యాచ్‌లు (వన్డేలు) కూడా ఆడారు. ఇందులో 3000 కంటే ఎక్కువ పరుగులు అతని ఖాతాలో ఉన్నాయి. కొత్త సెలెక్షన్ కమిటీ అతి పెద్ద బాధ్యత అండర్ -19 జట్టు ఎంపిక. వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో అండర్ -19 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది దాని కోసం సెలక్షన్ కమిటీ జట్టు ఎంపిక చేయనుంది.

దేశంలో ఈ రాష్ట్ర రైతులు అత్యంత ధనవంతులు..! అయితే మీ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది..?

T20 Captain: ‘వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. ఆ ఇద్దరికీ సారధ్య బాధ్యతలు ఇవ్వండి’

Sidhu – Rakhi Sawant: సిద్దూ‌ను రాఖీ సావంత్‌తో పోల్చిన ఆప్ లీడర్.. పంజాబ్‌లో రాజకీయ రచ్చ