AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery Benefits: బెల్లంతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ 5 వ్యాధులకు చక్కటి పరిష్కారం.!

Jaggery Benefits: ఎన్నో పోషకాలు కలిగిన బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లం నేరుగా తిన్నా, లేదా దానితో తయారైన ఆహార పదార్ధాలను తీసుకున్నా శరీరానికి..

Jaggery Benefits: బెల్లంతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ 5 వ్యాధులకు చక్కటి పరిష్కారం.!
Jaggery
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 23, 2021 | 5:08 PM

Share

ఎన్నో పోషకాలు కలిగిన బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లం నేరుగా తిన్నా, లేదా దానితో తయారైన ఆహార పదార్ధాలను తీసుకున్నా శరీరానికి కావాల్సిన మోతాదులో ఐరన్, పోషకాలు లభిస్తాయి. పూర్వకాలంలో ప్రజలు విరివిగా స్వీట్లు తినేవారు. ఎక్కువగా బెల్లం లేదా ఖండ్ లాంటివి తీసుకునేవారు. ఆ సమయంలో అందరూ కష్టపడి పని చేసేవారికి కాబట్టి ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు కాదు. శారీరకంగా ఎక్కువ శ్రమ పడేవారు కాబట్టి.. అదనపు క్యాలరీలు కరిగిపోయేవి. అయితే ఇప్పుడు బెల్లం స్థానంలో అందరూ చక్కెరను వినియోగిస్తున్నారు. నిజానికి బెల్లం ఎంతో ప్రయోజనకరం. పరిమితంగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..

1. రక్తహీనతను నివారిస్తుంది

ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే బెల్లం తినాలి. అంతేకాకుండా రక్తహీనతను నివారించేందుకు బెల్లం ఎంతగానో ఉపయొగపడుతుంది. బెల్లం శరీరంలోని హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచి.. రక్తహీనత వంటి సమస్యలను నివారిస్తుంది.

2. బరువు తగ్గడంలో సహాయపడుతుంది

చక్కెరతో పోలిస్తే బెల్లంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలని చూస్తున్నవారికి ఇది గొప్ప ఔషధం. అలాగే బెల్లం వల్ల ఉబ్బరం వంటి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. రోజూ బెల్లం తినడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

3. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

భోజనం చేసిన అనంతరం కొద్దిగా బెల్లం తింటే, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బెల్లం విటమిన్, ఖనిజ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటమే కాకుండా, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫైబర్, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్న బెల్లం రోజూ తింటే.. మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వాంతులు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది

బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి కావడమే కాకుండా శరీరంలోని విషపూరితమైన పదార్ధాలను తొలగిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తింటే జలుబు, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

5. ఎముకలను గట్టి పరుస్తుంది

కాల్షియం, భాస్వరం బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఎముకలను గట్టి పరుస్తాయి. బెల్లంతో పాటు అల్లం కూడా ప్రతీరోజూ సేవిస్తే, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..