AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajarla Ashok: బుల్లెట్‌ టూ బ్యాలెట్‌.. ప్రజాక్షేత్రంలోకి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు

మావోయిస్ట్ ఉద్యమానికి ఊపిరులూదిన వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు ప్రజాక్షేత్రంలోకి అడుగిడుతున్నారు. తాడిత పీడిత ప్రజల కోసం 25 ఏళ్ల తన ఉద్యమ ప్రస్థానాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని బలం, బలగంగా మార్చుకుంటూ.. నేను సైతం అంటూ ప్రజాక్షేత్రంలోకి దిగాడు ఐతు అలియాస్ గాజర్ల అశోక్.

Gajarla Ashok: బుల్లెట్‌ టూ బ్యాలెట్‌.. ప్రజాక్షేత్రంలోకి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు
Gajarla Ashok
Vijay Saatha
| Edited By: |

Updated on: Oct 12, 2023 | 6:24 PM

Share

మావోయిస్ట్ ఉద్యమానికి ఊపిరులూదిన వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు ప్రజాక్షేత్రంలోకి అడుగిడుతున్నారు. తాడిత పీడిత ప్రజల కోసం 25 ఏళ్ల తన ఉద్యమ ప్రస్థానాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని బలం, బలగంగా మార్చుకుంటూ.. నేను సైతం అంటూ ప్రజాక్షేత్రంలోకి దిగాడు ఐతు అలియాస్ గాజర్ల అశోక్.

అప్పటి వరంగల్‌ ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం అంటేనే గుర్తుకు వచ్చేది ‘గాజర్ల’ కుంటుంబం. అప్పటి పీపుల్స్‌వార్‌.. ఇప్పటి మావోయిస్టు పార్టీకి అంకితమైన కుటుంబం అది. ఆ కుటుంబానికి చెందిన వారంతా అప్పటి పరిస్థితులలో దొరల పాలనకు.. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారే. ప్రజలలో చైతన్యం తెచ్చి హక్కుల కోసం పోరాడిన యోధులే.

వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ–మల్లయ్య దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌లు సంతానం. వారికున్న ఎనిమిదెకరాల భూమితోపాటు గీత వృత్తి ఆ కుటుంబానికి ఆధారం. పెద్ద కొడుకు రాజయ్య అనారోగ్యంతో మరణించగా.. రెండవ కొడుకు సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. అప్పటికే వారి తల్లిదండ్రులు కనకమ్మ–మల్లయ్యలు కన్నుమూయడంతో మిగతా వారు సారయ్య, రవి, అశోక్‌లు విప్లవపంథాను ఎంచుకుని పీడిత ప్రజల నాలుకలలో నానుతున్నారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి 1989లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. అయితే అప్పుడు పోలీసుల నిర్భందం, వేధింపులు, అణచివేత మూలంగా 1992లో గాజర్ల రవి అలియాస్‌ గణేష్, 1994లో గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతులు కూడా అన్నల బాట పట్టారు.

మావోయిస్ట్ ఉద్యమంలో అమరులైన ఆజాద్‌, రమ

పీపుల్స్‌వార్‌లో చేరిన గాజర్ల సారయ్య అలియాస్‌ భాస్కర్‌ పేరిట చిట్యాల దళ కమాండర్‌గా పని చేసి అంచలంచెలుగా ఎదిగి పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పార్టీగా మారిన పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, మిలటరీ ప్లాటూన్‌ కమాండర్‌గా పనిచేసి ఏటూరునాగారం అటవీప్రాంతం కంతనపల్లి అడవుల్లో 2008 ఏప్రిల్‌ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తన సహచరి రమతోపాటు ఊపిరి వదిలారు. ఆ ఎన్‌కౌంటర్‌ ఇప్పటికీ సంచలనంగా మిగిలిపోగా న్యాయ విచారణ సైతం కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా గణేష్‌

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004–05లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో అప్పటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పార్టీ తరుపున ప్రతినిధిగా పాల్గొన్నారు గాజర్ల అశోక్ అలియాస్ గణేష్. అప్పటికే ఆయన ఆంధ్ర–ఒడిశా బార్డర్‌ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే అప్పటి ప్రభుత్వ విధానాలతో పార్టీకి పొసగకపోవడంతో తిరిగి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే ప్రతిసారీ ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా గాజర్ల సోదరుల పేర్లు వినబడడం చిట్యాల ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. మెరుపుదాడులు చేయడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ముగ్గురు ‘గాజర్ల’ సోదరులు ఆరితేరిన వారుగా ఇప్పటికీ పార్టీలో, పోలీసు వర్గాలలో పేరుంది. కొద్దిరోజుల క్రితమే ఆరోగ్య కారణాలతో మావోయిస్టు పార్టీని వీడిన గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కీలకంగా మారింది. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక చేరడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..