AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కాంగ్రెస్‌లో ఆగని ‘టికెట్ల’ పంచాయితీ.. హైకమాండ్‌కు బీసీ నేతల అల్టిమేటం..! రేపే ఫైనల్ నిర్ణయం..

Telangana Assembly Elections: కాంగ్రెస్‌లో అలకలు.. హెచ్చరికలు.. బుజ్జగింపులు.. అసంతృప్తులు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ కామనే.. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో ఏ చిన్న ఇష్యూ అయినా సరే.. నేతలంతా బహిరంగంగానే గళం విప్పుతారు.. అప్పటికప్పుడు కోపగించుకోవటాలు.. తెల్లారే సరికి చేతులు కలుపుకోవటాలు అనేది.. ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.. కానీ.. ఈ సారి కాంగ్రెస్‌లో సరికొత్త సమస్య వచ్చి పడింది..

Telangana Congress: కాంగ్రెస్‌లో ఆగని ‘టికెట్ల’ పంచాయితీ.. హైకమాండ్‌కు బీసీ నేతల అల్టిమేటం..! రేపే ఫైనల్ నిర్ణయం..
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Oct 12, 2023 | 5:45 PM

Share

Telangana Assembly Elections: కాంగ్రెస్‌లో అలకలు.. హెచ్చరికలు.. బుజ్జగింపులు.. అసంతృప్తులు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ కామనే.. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో ఏ చిన్న ఇష్యూ అయినా సరే.. నేతలంతా బహిరంగంగానే గళం విప్పుతారు.. అప్పటికప్పుడు కోపగించుకోవటాలు.. తెల్లారే సరికి చేతులు కలుపుకోవటాలు అనేది.. ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.. కానీ.. ఈ సారి కాంగ్రెస్‌లో సరికొత్త సమస్య వచ్చి పడింది.. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది తెలంగాణలో అధికారం చేపట్టాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో.. టికెట్ల లొల్లి మాత్రం ఒడువని ముచ్చటగా మారింది. ఇలా ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది.. అభ్యర్థుల ప్రకటనకు ముందు రోజూ ఇదే ఎపిసోడ్ కొనసాగుతుండటంతో హైకమాండ్ ఏం తెల్చలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రేపోమాపో విడదలయ్యే కాంగ్రెస్ తొలి విడత జాబితాలో 72 టికెట్లు ప్రకటిస్తారని, అందులో కనీసం 10 టికెట్లైనా బీసీలకు లేకపోవచ్చని బీసీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తుండటం ఆపార్టీలో కలకలం రేపింది. తుది విడతగా రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఫైనల్‌గా తమ డిమాండ్ వినిపించేందుకు ఏకంగా గాంధీభవన్‌లోనే ధర్నాకు డిసైడయ్యారు బీసీ నేతలు. జనాభా ప్రకారం చూసినా, కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీ ప్రకారం చూసినా పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున బీసీలకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. పార్టీ గెలవాలంటే ఎన్ని ఎక్కువ బీసీ టికెట్లు ఇస్తే అంత మేలని కూడా బీసీ నేతలు సూచిస్తున్నారు.

ఈ క్రమంలో నాలుగు అంశాలతో కాంగ్రెస్‌ పెద్దలకు బీసీ నేతలు అల్టిమేటం జారీచేశారు.

  • హామీ ప్రకారం 34 టికెట్లు ఇస్తారా..? ఇవ్వరా?
  • ఏ సర్వే ప్రాతిపదికన కొత్త నేతలకు టికెట్లు ఇస్తున్నారు?
  • వలస నేతల్లో బీఆర్‌ఎస్‌ కోవర్టులున్నారు జాగ్రత్త !
  • రాజ్యసభ, ఎమ్మెల్సీ లాంటి పోస్టులను తమకు ఎరవేస్తే కుదరదు

అంటూ.. బీసీ నేతలు కాంగ్రెస్ హైకమాండ్‌కు తమ డిమాండ్లను వినిపించారు. ఇలా ఎన్నో ఉదాహరణలను పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. మక్తల్‌లో బీసీ నేత శ్రీహరిని కాదని, కొత్తగా పార్టీలో చేరిన సీతా దయాకర్‌కి ఎలా సీటు ఇస్తారు? మల్కాజ్‌గిరిలో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నందికంటి శ్రీధర్‌ని కాదని, పార్టీలో చేరక ముందే మైనంపల్లిని ఎలా ఎంపిక చేస్తారు? ఏ సర్వేల ప్రాతిపదికన వీళ్లకు టికెట్లపై హామీ ఇచ్చారు..? అంటూ కాంగ్రెస్ బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కొత్తగా పార్టీలో చేరేవాళ్లలో బీఆర్‌ఎస్ కోవర్టులున్నారని కూడా హెచ్చరిస్తున్నారు. టికెట్ల ఒత్తిడిని తగ్గించుకోడానికి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్లు అంటూ ఆశ చూపిస్తే కూడా ఒప్పుకునేది లేదంటూ కాంగ్రెస్ నేత కత్తి వెంకట స్వామి స్పష్టంచేశారు.

ఇప్పటికే.. కమ్మ సామాజిక వర్గానికి 10 సీట్లు కేటాయించాలని కమ్మవారి ఐక్య వేదిక నేతలు.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కలిసి విన్నవించారు. గతంలో తమ సామాజిక వర్గానికి తక్కువ సీట్లు కేటాయించారని.. ఇప్పుడైనా సముచిత స్థానాన్ని కల్పించి సీట్లు కేటాయించాలంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.

మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకముందే.. ఆశావహులు తమ డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచడం.. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుండటం హస్తం పార్టీలో సరికొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..