Big News Big Debate: పొలిటికల్ ర్యాగింగ్.. రాజకీయ రంగు పులుపుకున్న మెడికో సూసైడ్ అటెంప్ట్ కేసు..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో రాజకీయ పార్టీలు ఎంట్రీ ఇచ్చాయి. పరామర్శల పేరుతో రంగంలో దిగిన నాయకులు.. ఒక్కక్కరు ఒక్కో కోణం ఆవిష్కరిస్తున్నారు...
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో రాజకీయ పార్టీలు ఎంట్రీ ఇచ్చాయి. పరామర్శల పేరుతో రంగంలో దిగిన నాయకులు.. ఒక్కక్కరు ఒక్కో కోణం ఆవిష్కరిస్తున్నారు. లవ్ జీహాద్ కలర్ కూడా అంటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ బీజేపీ నేతలకు బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో విద్యార్ధులు రెండు వర్గాలు విడిపోవడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ నిమ్స్‌లో మెడికో స్టూడెంట్ ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు చెప్పడం కుటుంబసభ్యులకి ఊరటనిస్తోంది.
ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అన్నీ సాక్ష్యాలను సేకరించామన్న వరంగల్ సీపీ రంగనాథ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్‌ను అరెస్టు చేశామన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని సైఫ్ వేధించాడన్నారు సీపీ. దీనికి సంబంధించిన వాట్సప్ డేటాను రీట్రీవ్ చేశారు. ర్యాగింగ్ చట్టం కింద చేపడుతున్నామన్నారు కమిషనర్.. ప్రీతిని సైఫ్ వేధించిన సంఘటనలు రెండు మూడు జరిగినట్టు గుర్తించామన్నారు. అటు ప్రీతి సూసైడ్ ఎపిసోడ్ రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనలో ర్యాగింగ్‌తో పాటు లవ్ జిహాద్ కూడా ఉందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు.
లవ్ జిహాద్ ఆరోపణలు ఖండించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు మంత్రి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఈ కేసులో వరంగల్ లో విద్యార్ధులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. సైఫ్ అరెస్ట్‌ను తప్పుబడుతూ సమ్మె నోటీసు ఇచ్చారు కొందరు విద్యార్ధులు. ఎంజీఎం మెయిన్ గేట్ దగ్గర ఆందోళన దిగారు. ప్రీతి ఆత్మహత్యయత్నం వ్యవహారంలో ఎవరి కోణం వారిదే… చావుతో పోరాడుతున్న సమయంలో స్వాంతన ఇవ్వాలని పార్టీలు, ప్రముఖులు దీనిని కూడా రాజకీయంగా వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..