Hyderabad Metro Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రోలో ఖాళీలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..
ప్రయాణికులకు సేవలందిస్తూ ఆదరణ చూరగొంటున్న హైదరాబాద్ మెట్రో.. నిరుద్యోగులకూ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ మెట్రో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పోస్టుల సంఖ్య, అర్హతలతో..
ప్రయాణికులకు సేవలందిస్తూ ఆదరణ చూరగొంటున్న హైదరాబాద్ మెట్రో.. నిరుద్యోగులకూ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ మెట్రో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పోస్టుల సంఖ్య, అర్హతలతో పాటు పలు వివరాలను వెల్లడించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల వివరాలు, అర్హతలు, ఉద్యోగాల దరఖాస్తు తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో వివరాలను పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. నిరుద్యోగులు ఆసక్తి, అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేసి, కరెంట్ ఆపర్చ్యునిటీస్ పై పైన క్లిక్ చేయాలి. మీ అర్హతలు, వివరాలు నమోదు చేసి KeolisHyd.Jobs@keolishyderabad.com మెయిల్ ఐడీకి పంపించాలి. ఏఎంఎస్ ఆఫీసర్- 1, సిగ్నలింగ్ టీమ్- 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- 6, ట్రాక్స్ టీమ్ లీడర్- 2, ఐటీ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి.
ఏఎంఎస్ ఆఫీసర్ పోస్టుకు ఇంజనీరింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. ట్రాక్స్ టీమ్ లీడర్ పోస్టుకు సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ, 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..