Telangana: అప్లికేషన్ల ఫీజులు భారీగా పెంపు.. విద్యార్థులపై రూ.4.5కోట్లు భారం..

తెలంగాణలో ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షల కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు.. దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. అయితే.. ఇక్కడే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోంది. ఉన్నత..

Telangana: అప్లికేషన్ల ఫీజులు భారీగా పెంపు.. విద్యార్థులపై రూ.4.5కోట్లు భారం..
Applications
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 25, 2023 | 9:02 AM

తెలంగాణలో ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షల కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు.. దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. అయితే.. ఇక్కడే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోంది. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న అన్ని ప్రవేశ పరీక్షల ఫీజులు ఈ సారి అమాంతం పెరిగాయి. గతేడాదితో పోలిచే ప్రతి పరీక్షకు రూ.100 పెంచారు. ఎంసెట్‌కు గతేడాది ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ విద్యార్థులకు రూ.400 ఉంటే.. ఈసారి రూ.500కు, ఇతరులకు రూ.800 నుంచి రూ.900కు పెంచారు. పీజీఈసెట్‌ రుసుము ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ విద్యార్థులకు రూ.500 నుంచి రూ.600కు, ఇతరులకు రూ.1000 నుంచి రూ.1100కు చేరాయి. ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌, ఈసెట్‌లకూ పెంచనున్నారు. ఈ ఆరు పరీక్షలకు పెంచిన ఫీజులతో విద్యార్థులపై రూ.4.50 కోట్ల భారం పడే అవకాశముంది.

మరోవైపు.. తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు. ఏప్రిల్ 12 నుండి 14వ తేదీవరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. 250 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చుమే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది.

ఫిబ్రవరి నెల 28 న పీజీఈసెట్​నోటిఫికేషన్​విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్​30 వరకు పీజీఈసెట్​కు అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. లేటు ఫీజుతో మే 24 వరకు పీజీఈసెట్​ దరఖాస్తుల స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే