Hyderabad: హెల్తీ బేబీ షోను ప్రారంభించిన కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజనకవర్గంలో హెల్తీ బేబీషో క్యాంపెయిన్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చిన్నారుల్లో పౌష్టికాహర లోపానికి చెక్ పెట్టేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు...
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజనకవర్గంలో హెల్తీ బేబీషో క్యాంపెయిన్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చిన్నారుల్లో పౌష్టికాహర లోపానికి చెక్ పెట్టేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీ మరియు హౌసింగ్ సొసైటీలో “హెల్తీ బేబీ షో” కోసం ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ల పంపిణీతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇటీవల సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మోదీ ట్వీట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రెట్టింపు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే అంతకు ముందు హెల్తీ బేబీ షో క్యాంపెయిన్ గురించి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, హౌజింగ్ సొసైటీ, బస్తీలోనూ ‘హెల్తీ బేబీ షో’కు సంబంధించిన దరఖాస్తు ఫామ్‌లను పంచడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ ఇందులో ఉన్నాయి. మొదటగా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇటీవలే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
This is a noteworthy effort, which will greatly benefit children. https://t.co/qC1LUbArRc
— Narendra Modi (@narendramodi) February 24, 2023
ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోషకాహార లోపాన్ని తొలగించేందుకు తీర్మానం కూడా చేశారు. ఈ పౌష్టికాహార కిట్‌లో ప్రోటీన్ పౌడర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్, యాంటీ వార్మ్ మందులు, ప్రోటీన్ బిస్కెట్, నెయ్యి, ఖర్జూరం, డైపర్లు, టవల్, హ్యాండ్ వాష్, ఫోటో ఫ్రేమ్‌తో పాటు టెడ్డీని అందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..