CM Revanth Reddy: ప్రజాదర్భార్‌కు క్యూ కడుతున్న ప్రజలు.. ఈ సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు..
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదలు అనేక సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రోజూ ప్రజా దర్భార్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం ప్రగతి భవన్ వద్ద అడ్డుగా ఉన్న ఇనుప కంచె తొలగించి అక్కడే ప్రజా దర్భార్ని ఏర్పాటు చేశారు. డిశంబర్ 7 న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి డిశంబర్ 8 ఉదయం 10 గంటల నుంచి జోతిరావ్ పూలే ప్రజా భవన్ వద్ద ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదలు అనేక సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రోజూ ప్రజా దర్భార్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం ప్రగతి భవన్ వద్ద అడ్డుగా ఉన్న ఇనుప కంచె తొలగించి అక్కడే ప్రజా దర్భార్ని ఏర్పాటు చేశారు. డిశంబర్ 7 న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి డిశంబర్ 8 ఉదయం 10 గంటల నుంచి జోతిరావ్ పూలే ప్రజా భవన్ వద్ద ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. నాటి నుంచి నేటి వరకూ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది.
వివిధ రకాల సమస్యలతో ప్రజా దర్బార్‌కి సామాన్యుల తాకిడి ఎక్కువైంది. కేవలం హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల వారే కాకుండా.. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాభవనానికి ప్రజలు చేరుకుంటున్నారు. తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో సీఎంకు సమర్పించుకుంటున్నారు. ప్రజా దర్బార్ కు వస్తున్న విన్నపాలలో ఎక్కువగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ధరణి తరువాత డబల్ బెడ్ రూమ్ ఇల్లు, వివిధ శాఖల అధికారులపై కంప్లైంట్స్ తో బాధితులు వస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..