Telangana: అయ్యో పాపం..ఇదెక్కడి ఘోరం..! సకినాలు తింటూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..

కొందరు జిమ్‌లో, కొందరు పెళ్లి పీటలపై మరికొందరు స్నేహితులు, బంధువులతో సరదాగా కాలక్షేపం చేస్తూ.. ఇంకొందరు తరగతి గదిలో స్పృహతప్పి పడిపోతున్నారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోతుంది. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు కూడా రెప్పపాటు కాలంలోనే.. విగతజీవులుగా మారిపోతుంటారు. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ పలహారం సకినాలు తింటూ ఓ వ్యక్తి మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

Telangana: అయ్యో పాపం..ఇదెక్కడి ఘోరం..! సకినాలు తింటూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..
Sakinalu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2024 | 5:42 PM

మరణం అనేది ఎవరికైన సరే.. తప్పని పరిస్థితి. కానీ, ఆ చావు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొందరు నిండు నూరెళ్లు సంతోషంగా జీవించి అన్ని సుఖాలు, సంతోషాలు అనుభవిస్తారు. కానీ, కొందరు చిన్న తనంలోనే ముక్కుపచ్చలారకుండానే మృత్యువు మింగేస్తుంది. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటారు. కొందరు అనారోగ్యాలతో, కొందరు విష పురుగుల, జంతువుల బారినపడి కూడా చనిపోతుంటారు. ఇక ఇటీవలి కాలంలో ప్రజల్ని మింగేస్తున్న హార్ట్‌ ఎటాక్‌ కూర్చున్న వారిని కూర్చున్నట్టుగానే, నిలుచున్న వారిన నిలుచున్న చోటే కుప్పకూలేలా చేస్తుంది. హార్ట్‌ ఎటాక్‌తో చాలా మంది ఉన్నట్టుండి ప్రాణాలు కొల్పోతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కొందరు జిమ్‌లో, కొందరు పెళ్లి పీటలపై మరికొందరు స్నేహితులు, బంధువులతో సరదాగా కాలక్షేపం చేస్తూ.. ఇంకొందరు తరగతి గదిలో స్పృహతప్పి పడిపోతున్నారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోతుంది. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు కూడా రెప్పపాటు కాలంలోనే.. విగతజీవులుగా మారిపోతుంటారు. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ పలహారం సకినాలు తింటూ ఓ వ్యక్తి మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన 65ఏళ్ల దినసరి కూలి ఎన్‌ రంగారావు అనే వ్యక్తి.. ఊహించని విధంగా మరణించాడు. మంగళవారం రోజున సాయంత్రం వేళ అతడు కాస్త చిరుతిండి తినాలనిపించి సకినాలు తిన్నాడు. అది గొంతులో ఇరుక్కున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా అతడు ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. దీంతో స్థానికులు గమనించి హుటాహుటినా అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రంగారావును పరిక్షించిన వైద్యులు.. అప్పటికే అతడు మృతిచెందినట్టుగా నిర్దారించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు రంగారావు మృతిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు మంచిర్యాల సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌ మాట్లాడుతూ.. చిరుతిండి సకినాల ముక్క గొంతులో ఇరుక్కోవడంతో రంగారావు ఊపిరాడక చనిపోయినట్టుగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..