AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నారి స్నేహం..! నువ్వు, నేను వెనుక ఇంకెవరున్నారో తెలుసా..? హృదయాల్ని హత్తుకునే దృశ్యం..

జనవరి 29న షేర్ చేయబడిన ఈ వీడియో 2.1 మిలియన్ల వీక్షణలు, 56,000కు పైగా లైక్‌లను పొందింది. వీడియోకు అనేక కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఇది ఎంతో అందమైన దృశ్యం అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు మనుషులు, జంతువుల మధ్య బంధాన్ని చూసేందుకు నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంటున్నారు. అందమైన స్నేహితులు సైకిల్‌పై కలిసి

Viral Video: చిన్నారి స్నేహం..! నువ్వు, నేను వెనుక ఇంకెవరున్నారో తెలుసా..? హృదయాల్ని హత్తుకునే దృశ్యం..
Little Girl Cycle Ride Wit
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2024 | 5:15 PM

Share

అత్యంత విశ్వాసం గల జంతువు కుక్క అని చెబుతారు… అలాంటి కుక్కలు చిన్న పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. పిల్లలతో కలిసి పిల్లలుగా మారే కుక్కలు నిస్సందేహంగా చిన్నారులకు మంచి స్నేహితులు. ఈ అమాయక మనస్తత్వం గల స్నేహితుల మధ్య అందమైన బంధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఒక చిన్న అమ్మాయి కుక్కలతో కలిసి సైకిల్‌పై తిరుగుతుంది. ఈ అందమైన వీడియో వీక్షకుల మనసుదోచుకుంటోంది.

పెంపుడు కుక్కలు పిల్లలతో ఎంతో ఆప్యాయంగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా తమ అమాయక స్నేహితులతోనే ఎక్కువ సమయం ఆడుకునేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ చిన్నారులు తమ వద్ద ఎన్ని బొమ్మలు ఉన్నా పిల్లులు, కుక్కలతో ఆడుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అవి పెంపుడు జంతువు అయినా కాకపోయినా కూడా చిన్నారులకు వాటితో స్నేహం చాలా ఇష్టం. పిల్లలతో కలిసి చిన్నపిల్లల్లా ఆడుకునే ఈ ముద్దుగుమ్మల సహృదయం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ అమాయక మనస్తత్వం గల స్నేహితుల మధ్య అందమైన బంధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక చిన్న అమ్మాయి కుక్కలతో కలిసి సైకిల్‌పై తిరుగుతుంది. ఈ అందమైన వీడియో జంతు ప్రేమికులకు బాగా నచ్చింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ చిన్నారి సైకిల్‌పై కుక్కలను కూర్చోబెట్టుకుని వెళుతున్న క్యూట్ సీన్‌ని చూడొచ్చు. వైరల్ వీడియో X ఖాతా @TheFigen_లో సో బ్యూటిఫుల్ అనే శీర్షికతో షేర్‌ చేయబడింది. వైరల్ వీడియోలో ఒక చిన్నారి తమ ఇంట్లోని మూడు కుక్కలను సైకిల్‌పై ఎక్కించుకుని ఇంటి చుట్టూ తిరుగుతోంది. కుక్కలు కూడా బైక్ రైడ్‌ని బాగా ఎంజాయ్ చేయడం మనం చూడొచ్చు.

జనవరి 29న షేర్ చేయబడిన ఈ వీడియో 2.1 మిలియన్ల వీక్షణలు, 56,000కు పైగా లైక్‌లను పొందింది. వీడియోకు అనేక కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఇది ఎంతో అందమైన దృశ్యం అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు మనుషులు, జంతువుల మధ్య బంధాన్ని చూసేందుకు నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంటున్నారు. అందమైన స్నేహితులు సైకిల్‌పై కలిసి స్కూల్‌కి వెళ్తున్నారు అంటూ మరో వినియోగదారు ఫన్నీగా రాశారు. చాలా మంది ఈ క్యూట్ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
భార్యని భర్త ఖర్చుల లెక్కలు అడగటం తప్పా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్