AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అద్దంలో తనను తాను చూసుకున్న పిల్లి.. చివరకు ఎలా రియాక్ట్ అయిందో చూడండి..

ఈ వైరల్ వీడియోలో ఒక అమాయక పిల్లి అద్దం ముందు నిలబడి ఉంది. అంతలో ఎదురుగా ఉన్న అద్దంలో దాని ప్రతిబింబం చూసుకుంది.. అది వేరే జంతువు కావచ్చు అనుకుని కోపంగా ఊగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకి రెండు రోజుల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Viral Video: అద్దంలో తనను తాను చూసుకున్న పిల్లి.. చివరకు ఎలా రియాక్ట్ అయిందో చూడండి..
Stunned Cat
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2024 | 3:51 PM

Share

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వైరల్‌ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో ఫన్నీ వీడియోలకు కొదువ ఉండదు. అయితే, చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు చిరునవ్వు వచ్చేస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడిలో ఉన్న సరే.. ఇట్టే రిలాక్స్‌ అయిపోతారు. ఇక చిన్న పిల్లల్ని, జంతువులను అద్దం ముందు నిలబెట్టినప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ మరింత ఫన్నిగా ఉంటాయి. పిల్లలకు తొలిసారి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూపిస్తే.. ఆశ్చర్యంతో రకరకాల హావభావాలు వెల్లడిస్తారు. అదే జంతువులను తొలిసారి అద్దం ముందు నిలబెడితే.. అవి మిర్రర్‌లో తమ ప్రతిబింబం చూసుకుని దడుసుకుంటాయి. మరేదో ఇతర జీవి తన ముందుకు వచ్చింది అనుకుని పారిపోతాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

పిల్లి ఆడుకుంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఎలా షాక్ అయ్యిందనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లి రియాక్షన్ చూసి నవ్వి నవ్వి కడుపు తరుక్కుపోతుంది. ఈ వైరల్ వీడియోలో ఒక అమాయక పిల్లి అద్దం ముందు నిలబడి ఉంది. అంతలో ఎదురుగా ఉన్న అద్దంలో దాని ప్రతిబింబం చూసుకుంది.. అది వేరే జంతువు కావచ్చు అనుకుని కోపంగా ఊగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకి రెండు రోజుల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతా @CatFrolics లో షేర్‌ చేయబడింది. జనవరి 29న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు 36,000లకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియో ప్రారంభంలో ఒక పిల్లి బొమ్మతో ఆడుకోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత బొమ్మ అద్దం ముందు పడుతుంది.. దాంతో ఆ పిల్లి దాన్ని తీసుకురావడానికి వెళ్లగా, అద్దంలో ప్రతిబింబం చూసి షాక్‌కు గురవుతుంది. ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని రాయిలా నిల్చుండిపోతుంది. ఇదంతా వీడియోలో రికార్డైంది. కొంత సేపు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి కోపంగా, షాక్‌కు గురైనట్టుగా కనిపిస్తుంది. ఆ పిల్లిని చూస్తే మీ ముఖంలో కూడా ఖచ్చితంగా చిరునవ్వు వస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..