Bus Driver Heart Attack: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. వేగంగా వెళ్తున్న బస్సులో 60 మంది ప్రయాణికులు..!
ఈ విషాద సంఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి బాలాసోర్‌లోని పంచలింగేశ్వర్ ఆలయానికి 60 మంది పర్యాటకులతో బస్సు వెళుతోంది. మార్గమధ్యలో పాతాపూర్ చాక్ దగ్గర కదులుతున్న బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్‌కు విపరీతమైన ఛాతీ నొప్పి మొదలైంది. దాంతో..
ఒడిశాలో ఓ విషాద సంఘటన వెలుగు చూసింది. మృత్యువు డ్రైవర్ ముందు నిలబడి ఉన్నప్పటికీ..అతడు మరో 60 మంది ప్రాణాలను కాపాడాలని భావించాడు. అతను తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూనే బస్సును సురక్షితంగా పక్కకు ఆపేసి..స్పృహతప్పి పడిపోయాడు. అలాగే, తుదిశ్వాస విడిచాడు.. చనిపోయే ముందు కూడా తోటి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌కు బస్సులోని ప్రయాణికులతో పాటు, విషయం తెలిసిన ప్రజలు కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఈ విషాద సంఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి బాలాసోర్‌లోని పంచలింగేశ్వర్ ఆలయానికి 60 మంది పర్యాటకులతో బస్సు వెళుతోంది. మార్గమధ్యలో పాతాపూర్ చాక్ దగ్గర కదులుతున్న బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్‌కు విపరీతమైన ఛాతీ నొప్పి మొదలైంది. అయినప్పటికీ ఆ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు.. బస్సును రోడ్డు పక్కన ఆపి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు..
ఈ విధంగా డ్రైవర్ తన మరణానికి ముందు 60 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ పరిస్థితిని గమనించిన బస్సులోని ప్రయాణికులు స్థానికుల సాయంతో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించారు.
డ్రైవర్ బస్సును ఆపకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది.
ఈ విషయమై అమిత్ దాస్ అనే బస్సులోని ప్రయాణికుడు మాట్లాడుతూ.. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలిపారు. స్పృహ తప్పి పడిపోయేలోపు బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా ఆపాడు. డ్రైవర్‌కు అప్రమత్తవల్లే..బస్సులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి