Gongura: గోంగూరతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..? ఈ సమస్యలన్నీ పరార్..!
ఆకు కూరలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అలాంటి ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరతో పచ్చడి, పప్పు, గోంగూర పులిహోరను, గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు. ఇకపోతే, గొంగూరలో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి తెల్ల గోంగూర, రెండు ఎర్ర గోంగూరలు లభిస్తాయి. అయితే, ఏదైనా సరే.. తరచూ గోంగూర తింటే ఆరోగ్యానికి పుష్కలమైన ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 30, 2024 | 6:43 PM

గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లతోపాటు పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారు గోంగూరను తినడం వల్ల వీటి నుండి ఉపశమపం లభిస్తుంది.

గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పీరియడ్స్ సమయంలో మహిళలు నొప్పులతో బాధపడుతుంటారు. నీరసంగా ఉంటారు. ఇలాంటి సమయంలో గోంగూర తినడం వల్ల వారి శరీరానికి శక్తి లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, విరిగిన ఎముకలు త్వరగా అతుకునేలా చేయడంలో గోంగూర ఉపయోగపడుతుంది.

గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా కూడా విరేచనాలకు చెక్ పెట్టవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో గోంగూర ఎంతో సహాయపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు

గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచి జరుగుతుంది. గోంగూర ఆకుల పేస్ట్‌ను తలకు పట్టించి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం, చుంద్రు సమస్య తగ్గుతుంది.




