ప్రతిరోజూ పెరుగు తింటే కలిగే అసంఖ్యాక ప్రయోజనాలు తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు

పెరుగులో పోషక గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజువారీ ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి రోజూ పెరుగు తినటం వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది.

Jyothi Gadda

|

Updated on: Jan 30, 2024 | 6:13 PM

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాగని మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదట. ముఖ్యంగా పెరుగు తింటే గట్‌ హెల్త్‌ మెరుగుపడుతుందని అంటుంటారు. పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది.

1 / 5
ముందుగా చెప్పుకున్నట్లుగానే పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలకు చాలా మంచిది. అదే విధంగా ఇమ్యూనిటీ పెంచడంలో పెరుగు చాలా మంచిది. పెరుగులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి.

2 / 5
అలాగే అలర్జీ, దగ్గు, వాపు సమస్యలు ఉన్నవారు పెరుగు తినకపోవడమే మంచిది. పెరుగును ఎప్పుడూ వేడి వేడిగా తినకూడదు. పెరుగును వేడి చేయడం వల్ల పెరుగు నాణ్యత దెబ్బతింటుంది. కావాలంటే అల్పాహారం లేదా భోజనంలో పెరుగు తినవచ్చు. అయితే రాత్రిపూట పుల్లని పెరుగు తినకపోవడమే మంచిది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. రోజుకు ఒకసారి పెరుగు తింటే మంచిది.

3 / 5
ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపి, రోగనిరోధక శక్తిని పెంచుతుది. అలాగే పుల్లని పెరుగులో విటమిన్ ఎ, బి 6, బి కొవ్వు, కాల్షియం, ఫాస్పరస్‌తో సహా వివిధ పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.  పుల్లటి పెరుగు శరీరంలో హానికరమైన వ్యర్థాలు పేరుకుపోకుండా నివారిస్తుంది.

4 / 5
తరచుగా నోటిపూతతో బాధపడే వారు కూడా పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది. కాబట్టి కడుపులో వేడి సమస్య ఉంటే మీరు పెరుగు తినవచ్చు. ఏ రకమైన కడుపు ఇన్ఫెక్షన్కైనా పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow us